AP CM YS Jagan flags of Kisan train in Anantapur to export horticulture products across country (Photo-Twitter)

Amaravati, Sep 9: ఏపీలో అనంతపురం నుండి ఢిల్లీకి కిసాన్‌ రైలు ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్‌, ఏపి సిఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ట్రైన్‌ను జెండా ఊపి (AP CM YS Jagan flags of Kisan train) ప్రారంభించారు. అనంతరం కిసాన్‌ రైలు అనంతపురం రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరింది. మహారాష్ట్ర నుంచి బిహార్‌కు వెళ్లే దేశంలోనే తొలి కిసాన్ రైలు (Kisan Train) గత నెలలో ప్రారంభమైంది. నాసిక్‌ జిల్లా దియోలలి నుంచి బిహార్‌లోని దనాపూర్‌కు కిసాన్‌ రైలును ఆగస్టులో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రారంభించారు.

ఇది రెండో రైలు. అక్టోబర్‌ నుంచి రైలును పూర్తిస్థాయిలో నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో రైతులు పండిస్తున్న ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్‌ కల్పించేందుకు (horticulture products) రాష్ట్ర ప్రభుత్వం చొరవతో బుధవారం ఢిల్లీకి ప్రత్యేకంగా ‘కిసాన్‌ రైలు’ ప్రారంభించారు. అనంతపూర్ నుంచి ఢిల్లీకి వెళ్లే కిసాన్ రైలు అక్టోబరు నుంచి ప్రతి రోజూ నడుస్తుంది.

AP CMO Tweet

కిసాన్ రైలు ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఏపీ సీఎం వైయస్ జగన్ తెలిపారు. అనంతపురంలో పండే పళ్లకు ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో మంచి పేరుంది. అనంతపురం నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌, మధ్యప్రాచ్య దేశాలకు కూడా పండ్లు ఎగుమతి అవుతున్నాయి. అనంత నుంచి హస్తినకు వెళ్తున్న తొలి కిసాన్‌ రైల్లో 500 టన్నుల వివిధ రకాల ఉద్యాన ఉత్పత్తులతో పాటు రైతులు, అధికారులు, కొందరు వ్యాపారులు వెళ్లడానికి ప్రత్యేకంగా స్లీపర్‌ కోచ్‌ బోగీ ఒకటి ఏర్పాటు చేశారు.

ఏపీ నుంచి నడిచే ప్రత్యేక రైళ్ల లిస్టు వచ్చేసింది, సెప్టెంబర్ 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లను నడపనున్న రైల్వేశాఖ, ఏపీ నుంచి 24 ప్రత్యేక రైళ్ల రాకపోకల సమాచారం మీకోసం

కిసాన్‌ రైలు సేవల ద్వారా రైతులు పండించే పళ్ళు, కూరగాయల రవాణాలో రోడ్డు మార్గంతో పోల్చుకుంటే ప్రయాణ సమయం, ఖర్చు ఆదా అవుతుంది. అంతేకాదు రాష్ట్రం బయట పంటను అమ్ముకుంటే మంచి ధర లభిస్తుంది. తద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఏపీ సీఎం తెలిపారు.