Subbaiah Hotel Seized: తింటున్న భోజనంలో కాళ్ల జెర్రీ… ఎన్ హెచ్ ఆర్సీ ఛైర్‌పర్సన్ ఆగ్రహం.. కాకినాడ సుబ్బయ్య హోటల్ సీజ్ (వీడియో)
నగరంలోని సూర్యారావు పేటలో ఉన్న సుబ్బయ్య హోటల్ లో ఈ ఘటన జరిగింది.
Vijayawada, Nov 15: విజయవాడలోని (Vijayawada) ప్రముఖ హోటల్ లో (Hotel) గురువారం మధ్యాహ్నం ఓ కస్టమర్ కు సర్వ్ చేసిన భోజనంలో కాళ్ల జెర్రీ ప్రత్యక్షమయ్యింది. నగరంలోని సూర్యారావు పేటలో ఉన్న సుబ్బయ్య హోటల్ లో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన సమయంలో అదే హోటల్ లో జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్ పర్సన్ విజయభారతి సయాని భోజనం చేస్తుండటంతో అవాక్కయ్యారు. దీంతో ఛైర్ పర్సన్ ఆదేశాలతో అధికారులు హోటల్ ను సీజ్ చేశారు.
Here's Video:
తినే ఆహారంలోకి జెర్రీ ఎలా వస్తుంది?
తినే ఆహారంలోకి కాళ్ల జెర్రీ ఎలా వస్తుంది? ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అంటూ కాకినాడ సుబ్బయ్య హోటల్ నిర్వాహకుల తీరుపై ఛైర్ పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని హోటళ్లలో తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాలు ఉండే ప్రదేశంలో ఘటన జరగడంతో జ్యూడిషియల్, రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించారు.