Rotten Chicken Seized In Hyderabad: బర్డ్ ఫ్లూ భయాల వేళ.. 5 క్వింటాళ్ళ మేర పట్టుబడ్డ కుళ్లిన చికెన్.. సీజ్ చేసిన అధికారులు.. ఎక్కడంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు బర్డ్ ఫ్లూ భయాలు వణికిస్తున్న వేళ.. ఆందోళన కలిగించే ఘటన ఒకటి వెలుగుచూసింది. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అన్నా నగర్ చికెన్ సెంటర్స్ లో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, కంటోన్మెంట్ బోర్డు హెల్త్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Rotten Chicken Seized In Hyderabad: బర్డ్ ఫ్లూ భయాల వేళ.. 5 క్వింటాళ్ళ మేర పట్టుబడ్డ కుళ్లిన చికెన్.. సీజ్ చేసిన అధికారులు.. ఎక్కడంటే?
Rotten Chicken Seized In Hyderabad (Credits: X)

Hyderabad, Feb 14: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఒకవైపు బర్డ్ ఫ్లూ (Bird flu) భయాలు వణికిస్తున్న వేళ.. ఆందోళన కలిగించే ఘటన ఒకటి వెలుగుచూసింది. హైదరాబాద్ (Hyderabad)) లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అన్నా నగర్ చికెన్ సెంటర్స్ లో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, కంటోన్మెంట్ బోర్డు హెల్త్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెండు షాపుల్లో తనిఖీలు చేయగా సుమారు ఐదు క్వింటాళ్ల కుళ్ళిన చికెన్ కనిపించింది. అధికారులు ఈ కుళ్లిన చికెన్ను సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. ఈ చికెన్ ఎప్పటి నుంచి నిల్వ ఉంచుతున్నారు? దేనికోసం వాడనున్నారు? ఎక్కడికి సరఫరా చేయనున్నారు? అనే అంశాలపై అధికారులు దృష్టిసారించారు.

ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కన్నప్పలో నటించిన ప్ర‌భాస్‌,మోహ‌న్‌లాల్, షాకింగ్ విషయాలను వెల్లడించిన మంచు విష్ణు

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ భయాందోళనలు

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బర్డ్‌ ఫ్లూ భయాందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, భీమడోలు, కొల్లేరు సమీప ప్రాంతాల్లోని కోళ్లఫారాల్లో మరణ మృదంగం కొనసాగుతుంది. చూస్తుండగానే లక్షలాది కోళ్లు కుప్పకూలిపోతున్నాయి. కానూరు, వేల్పూరులో ఏకంగా ఐదు లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. 15 రోజులుగా వణికిస్తున్న ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా  వైరస్‌ (బర్డ్ ఫ్లూ) కారణంగానే ఈ కోళ్లు మృతి చెందాయి. కోళ్లకు వైరస్‌ సోకుతుండటంతో జనాలు చికెన్‌ తినేందుకు భయపడుతున్నారు. దీంతో చికెన్‌ ధరలు కూడా భారీగా తగ్గిపోయాయి. ఏపీలో పెద్ద ఎత్తున కోళ్లు మృత్యువాత పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. సరిహద్దుల్లో చికెన్ లారీలను అధికారులు నిలిపెస్తున్నారు.

కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ఇదిగో, రుద్ర పాత్రలో కనిపించనున్న డార్లింగ్, ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల

(The above story first appeared on LatestLY on Feb 14, 2025 11:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).