Hersis Virus: డేంజర్ జోన్‌లో కోనసీమ, కరోనాను తలదన్నేమరో కొత్త వైరస్, ఇకపై చికెన్ తింటే హరీ, మూగజీవాలను అటాక్ చేస్తున్న హెర్సిస్ వైరస్, కలవరపెడుతున్న లంపి స్కిన్ వ్యాధి
ఇప్పుడు తాజాగా కోనసీమలో (Konaseema) మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. చైనాను కరోనా వైరస్ వణికిస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) కోనసీమను హెర్సిస్ వైరస్ (Hersis Virus) భయపెడుతున్నది. ఈ హెర్సిస్ వైరస్ వలన మూగజీవాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఈ హెర్సిస్ వైరస్ వల్ల లంపి స్కిన్ వ్యాధి (lump skin Disease) బారిన పడుతున్న మూగజీవాలు (Animals) అక్కడ పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి.
Amaravathi, Febuary 3: చైనాలోని వుహాన్ నగరంలో (Wuhan In China) పుట్టిన కరోనా వైరస్ (Coronavirus) దెబ్బకు ప్రపంచం విలవిలలాడుతోంది. ఇప్పుడు తాజాగా కోనసీమలో (Konaseema) మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. చైనాను కరోనా వైరస్ వణికిస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) కోనసీమను హెర్సిస్ వైరస్ (Hersis Virus) భయపెడుతున్నది.
కరోనావైరస్ గుట్టు విప్పేశారు, షాకింగ్ నిజాలు బట్టబయలు
ఈ హెర్సిస్ వైరస్ వలన మూగజీవాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఈ హెర్సిస్ వైరస్ వల్ల లంపి స్కిన్ వ్యాధి (lump skin Disease) బారిన పడుతున్న మూగజీవాలు (Animals) అక్కడ పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి.
భారత్ లోనూ విస్తరిస్తున్న కరోనా వైరస్
హెర్సిస్ వైరస్ సోకిన కోళ్లు, ఆవులు, గేదెల చర్మంపై బొబ్బలు వస్తున్నాయి. ఆ బొబ్బలు పగిలి రంద్రాలు ఏర్పడటంతో ఈ మూగజీవాలు చనిపోతున్నాయి. కొన్ని రోజుల్లోనే వేలాది కోళ్లు మృత్యువాత పడినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే వైరస్‌ను తగ్గించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ కనుగొనలేదని పశువైద్యులు చెప్తున్నారు.
చైనాలో చిక్కుకుపోయిన కర్నూలు యువతి
ఈ వైరస్ వలన తాము కోళ్లను నష్టపోతున్నామని అక్కడి వాసులు చెబుతున్నారు. ప్రస్తుతం మూగజీవాలకు మాత్రమే ఎటాక్ అవుతున్న ఈ వైరస్ వలన మనిషికి ఎలాంటి ప్రమాదం ఉంటుందో అని భయపడుతున్నారు.
ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర మీదుగా ఈ వైరస్ తూర్పుగోదావరి జిల్లాకు వ్యాపించినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఒడిశా నుండి వచ్చిన ఈ వైరస్‌కు మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. తమ పాడి పాలిట శాపంగా మారిన ఈ లంపి స్కిన్ వైరస్ నుంచి కాపాడాలంటూ ప్రభుత్వాన్ని కోనసీమ వాసులు వేడుకుంటున్నారు.
304 మందిని బలి తీసుకున్న కరోనావైరస్
కోనసీమలోని ముమ్మిడివరం, అమలాపురం, పి. గన్నవరం, రాజోలు, రావులపాలెం, కాట్రేనికోన, ఆలమూరు మండలాల్లో వేలాది పశువులు ఈ లంపి స్కిన్ వ్యాధి బారిన పడ్డాయి. ఇప్పటివరకు వెయ్యికి పైగా పశువులు ఈ వైరస్ బారిన పడగా వాటిలో ఇరవైకి పైగా ఆవులు మృతి చెందినట్లు రైతులు చెబుతున్నారు. ప్రపంచానికి పెను ముప్పు
భారత్‌లో తొలి కరోనావైరస్ కేసు నమోదు
ఈ వైరస్(virus) బారిన పడితే.. 104 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదై కళ్లు, ముక్కు నుండి నీళ్లు కారడం, నోటి నుంచి చొంగ కారడంతోపాటు చర్మం కింద కణుతులు ఏర్పడి పుండుగా మారతాయంటున్నారు. పుండుగా మారిన కొన్ని రోజులకే గోవులు బలహీన పడి మృత్యువాత పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారత్‌లో కరోనావైరస్ రెండో కేసు నమోదు
పశువైద్యులు తెలిపిన వివరాల ప్రకారం లంపి స్కిన్ వైరస్ లేదా బొలైన్ హెర్సిస్ వైరస్ -2 అనే సూక్ష్మజీవుల వలన ఈ వ్యాధి వస్తుందంటున్నారు . ఈ వ్యాధి కీటకాలు, స్రావాలు, క్రిములతో కలుషితమైన గాలి ద్వారా ఒక పశువు నుంచి మరో పశువుకు సోకుతుందని చెబుతున్నారు. ఆరోగ్యకర పశువు శరీరంలోకి ఈ వైరస్ ప్రవేశించిన 4 నుంచి 14 రోజుల తరువాత ఈ వ్యాధి బయపడే అవకాశం ఉందంటున్నారు.