KIA Motors: అన్నీ అబద్దాలే, మేము ఎక్కడికీ తరలిపోవడం లేదు, అసత్య ప్రచారాలు నమ్మకండి, జగన్ సర్కారు మాకు అండగా ఉంది, ఇక్కడ నుంచే ప్రపంచ స్థాయి కార్లు తయారుచేస్తాం, క్లారిటీ ఇచ్చిన కియా మోటర్స్ యాజమాన్యం
అనంతపురంలో ఉన్న కియో మోటర్స్ తమిళనాడుకు తరలిపోతుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు కియో మోటర్స్ ను తమిళనాడుకు పంపేలా ఉన్నాయని, ఇదేం పాలన అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేసారు. అయితే ఈ వివాదం మీద కియా మోటర్స్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది.
Anantapur, Febuary 8: గత కొద్ది రోజుల నుంచి ఏపీలో కియా మోటార్స్ న్యూస్ హాట్ టాఫిక్ గా మారింది. అనంతపురంలో ఉన్న కియో మోటర్స్ తమిళనాడుకు తరలిపోతుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు కియో మోటర్స్ ను తమిళనాడుకు పంపేలా ఉన్నాయని, ఇదేం పాలన అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేసారు. అయితే ఈ వివాదం మీద కియా మోటర్స్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది.
తమ అనంతపురం ప్లాంటు వేరే ప్రాంతానికి తరలి వెళుతోందంటూ వచ్చిన వార్తలో నిజం లేదంటూ కియా మోటర్స్ స్పష్టం చేసింది. తప్పుడు కథనాలను పట్టించుకోవద్దని సూచించింది. సమర్థుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని వెల్లడించింది.
దీర్ఘకాలిక లక్ష్యంతో అనంతపురంలో 1.1 బిలియన్ డాలర్లతో యూనిట్‌ను ఏర్పాటు చేశామని, ఇక్కడి నుంచే ప్రపంచస్థాయి కార్లను తయారుచేసి వినియోగదారులకు అందిస్తామని తెలిపింది.ఈ మేరకు కియా మోటర్స్ ఎండీ కుక్‌యున్ షిమ్ లేఖ రాశారు.
Here's ANI Tweet
న్యూఢిల్లీలో జరిగిన ఆటోఎక్స్‌పోలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో కలసి కియా ప్రతినిధులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా కియా ఎండీ కుక్‌యున్ షిమ్ రాసిన లేఖను కియా ప్రతినిధులు చదివి వినిపించారు.
దొనకొండ కేంద్రంగా డిఫెన్స్ క్లస్టర్
ఈ సందర్భంగా కియా జనరల్ మేనేజర్ సన్ ఊక్ వాంగ్ మాట్లాడుతూ.. కియా సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉన్న బంధం చెక్కు చెదరదని, కలసిమెలిసి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
Here's Andhra Pradesh Economic Development Board Tweet
కియా ఏపీ నుంచి తరలిపోతోందని.. ప్రాథమికంగా చర్చలు ప్రారంభమయ్యాయని రాయిటర్స్ కథనాన్ని ప్రచురించిన విషయం విదితమే. కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడకు తరలిపోయే అవకాశం ఉందని, తమిళనాడు ప్రభుత్వంతో కియా ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారని ఆకథనంలో పేర్కొంది. అయితే రాయిటర్స్ రాసిన తప్పుడు కథనంపై న్యాయపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కియో మోటర్స్ యాజమాన్యం తెలిపింది.
Here's IT Minister tweet
మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. కియా మోటార్స్ ఎక్కడికీ వెళ్లదని, రానున్న కాలంలో మరిన్ని ఆటో మొబైల్ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు.
దేశంలోనే తొలిసారి, మహిళల భద్రతకు ‘దిశ’ విభాగం
తమ ప్రభుత్వ సహకారంతోనే కియా మోటార్స్ రెండో మోడల్ని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని చెప్పారు. కియో మోటార్స్, తమిళనాడు ప్రభుత్వం కూడా అసత్య ప్రచారాన్ని ఖండించిందని, అయినా కొందరు కావాలనే స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం కొనసాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిందితులకు 21 రోజుల్లోనే కఠిన శిక్ష పడేలా చట్టం
కియాపై బాధ్యతరాహిత్యంతో ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరణ ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. ఎంతో రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇంత దుష్ప్రచారాలకు తెరతీయడం రాజకీయంగా దిగజారడమేనన్నారు.
Here's IT Minister tweet
కియా ఫ్యాక్టరీ రెండో మోడల్‌ను కూడా మార్కెట్లోకి తెస్తోందని, జూన్ లేదా జూలైలో మూడో మోడల్‌ను కూడా అందుబాటులోకి తేనుందని ఐటీ మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆ సంస్థ గట్టి నమ్మకంతో ఉందని తెలిపారు.
ఏపీ శాసనసభలో ఏపీ దిశ బిల్లుకు అమోదం
అలాగే కొన్ని ఐటీ సంస్థలకు తాము నోటీసులు ఇచ్చినట్టు, దీంతో అవి వేరే నగరాలకు వెళ్లిపోతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని కూడా తీవ్రంగా ఖండించారు. కియా మోటార్స్ తరలిపోతోందని చంద్రబాబు అంటున్నారని, ఎందుకు వెళ్లిపోతోందో, ఎక్కడికి వెళ్లిపోతోందో ఆయన వివరణ ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు.
రాజధాని అంశంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక ఆటోమొబైల్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. టాటా మోటార్స్ సంస్థ ప్రతినిధులు కంపెనీ విస్తరణ కార్యక్రమాలకు ఏపీని ఎంచుకుంటామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, ఇందుకోసం రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రెనాల్ట్ ఇండియా సీఈవో వెంకటరామ మామిలపల్లె తెలిపారు.
విశాఖలో మిలీనియం టవర్-బి నిర్మాణానికి నిధులు విడుదల
ఫోర్స్ ఇండియా, గ్రేట్ వాల్ మోటార్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి గౌతమ్ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. అనంతరం నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌తో సమావేశమై రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి ఆర్థిక సహకారమందిస్తామని అమితాబ్ హామీ ఇచ్చారు.