Amaravathi, January 4: మూడు రాజధానుల (Three Capitals) ఏర్పాటుపై ఏపీలో దుమారం రేగుతున్న వేళ పార్లమెంట్‌లో (Parliament) కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ రాజధానిపై లోక్‌సభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ అంశంపై కేంద్రం తొలిసారిగా స్పందించింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్(TDP MP Galla Jayadev) అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్(Minister of State for Home Affairs Nithayanada Rai) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సీఎం జగన్ దూకుడు..
రాజధానులు ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోదేనని కేంద్రం ఆ లేఖలో స్పష్టం చేసింది. రాజధాని అంశంపై(AP capital Issue) రాష్ట్రాలదే తుది నిర్ణయమని వెల్లడించింది. ఇందులో కేంద్రం కలగజేసుకోలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి తెలిపారు.
రాజధాని అంశంపై జాతీయ మీడియా ఇష్టాగోష్టిలో కూడా కేంద్ర ఉన్నత వర్గాలు ఇదే అంశాన్ని స్పష్టం చేశాయని సమాచారం. శాసనమండలి, రాజధాని అంశాల్లో కేంద్ర జోక్యం చేసుకోదని తెలిపినట్లు తెలుస్తోంది. ఏపీలో ఐదేళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వం ఉందని, రాజకీయ అంశాల్లో కేంద్రం చేసేదేమీ ఉండదని పేర్కొన్నట్లు సమాచారం.
2015 ఏప్రిల్ 4నలో ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిందని.. కానీ ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా రిపోర్టుల్లో చూశామని తెలిపారు. రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.కాగా, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
పెద్దల సభ రద్దుకు అసెంబ్లీ ఆమోదం
ఇదిలా ఉంటే ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటును టీడీపీ, బీజేపీ, జనసేనతో పాటు వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశంపై టీడీపీ అమరావతి గ్రామాల్లో ఆందోళన చేపట్టింది. అందులో భాగంగానే ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్.. లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. కానీ కేంద్రం మాత్రం రాజధానుల అంశంపై తమ జోక్యం ఉండబోదని వెల్లడించింది. తాము అనుకున్న దానికి విరుద్ధంగా కేంద్రం నుంచి ప్రకటన వెలువడటంతో టీడీపీ శ్రేణులు ఇప్పుడు ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది.