CM YS Jagan Visits Sarada Peetham: విశాఖలో ఏపీ సీఎం, ముఖ్యమంత్రి హోదాలో శారదా పీఠం వార్షికోత్సావాలకు హాజరైన వైయస్ జగన్, పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన పండితులు
Visakhapatnam AP CM YS Jagan With Swarupananda Swamy At Vizag Sarada Peetam Vaarshik Mahotsav (Photo-PTI)

Visakhapatnam, Febuary 3: విశాఖ జిల్లా (Visakhapatnam) పెందుర్తి మండలం చినముషిరి వాడలోని శారదా పీఠం వార్షిక మహోత్సవానికి (Sarada Peetham Vaarshik Mahotsav) ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. సీఎం హోదాలో ఆయన రెండో సారి శారదా పీఠా న్ని సందర్శించారు. సోమవారం శారద పీఠం చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు (AP CM YS Jagan) వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, (Swarupananda Swamy) స్వాత్మానందేంద్రల ఆశీస్సులు అందుకున్నారు.

డేంజర్ జోన్‌లో కోనసీమ, కరోనాను తలదన్నేమరో కొత్త వైరస్

శారదా పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజల చేశారు. పీఠాధిపతులతో కలిసి జమ్మిచెట్టు ప్రదక్షిణ చేసిన సీఎం వైఎస్‌ జగన్‌.. గోమాతకు నైవేద్యం సమర్పించారు. పీఠంలో నూతనంగా నిర్మించిన స్వయం జ్యోతి మండపం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

అవ్వా ఇదిగో పెన్సన్.., ఇంటింటికి వెళ్లి పెన్సన్ ఇచ్చిన గ్రామ వాలంటీర్లు

ఆగమ యాగశాలలో ఐదు రోజులుగా టీటీడీ (TTD) ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనివాస చతుర్వేద హవనం పూర్ణాహుతిలో సీఎం వైఎస్‌ జగన్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం లోక కల్యాణార్థం విశాఖ శారదా పీఠం చేపట్టిన రాజశ్యామల యాగం పూర్ణాహుతికి సీఎం వైయస్ జగన్ హారజయ్యారు.

ఆలయాలకు పోటెత్తిన జనసంద్రం

అలాగే పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానంలో ముద్రించిన తత్త్వమసి గ్రంథాన్ని సీఎం స్వీకరించారు. శ్రౌత మహాసభలో ఉత్తమ పండితునికి సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా స్వర్ణకంకణధారణ చేశారు.

Here's Video

సీఎం వైఎస్‌ జగన్‌ వెంట వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే అదీప్‌రాజు, టీటీడీ పాలక మండలి సభ్యులు ప్రశాంతిరెడ్డి, నాదెళ్ల సుబ్బారావు, శేఖర్‌రెడ్డిలు ఉన్నారు. అంతకుముందు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం లభించింది.

Here's Video

వైఎస్సార్‌సీపీ నేతలు, మహిళలు, అభిమానులు సీఎం వైఎస్‌ జగన్‌కు ఎయిర్‌పోర్ట్‌ వద్ద స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సీఎం వైఎస్‌ జగన్‌.. శారదా పీఠం చేరుకున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు విశాఖలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మీ గ్రామంలోకి సీఎం జగన్ వస్తున్నాడు

తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్‌లకు విశాఖ పీఠంతో సన్నిహిత సంబంధాలున్న సంగతి తెలిసిందే. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత స్వరూపానందేంద్ర సరస్వతి జగన్‌పై తన ప్రేమను చాటుకున్నారు. 'నా హృదయంలో ఒక ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి జగన్. ఆయనంటే నాకు పరమ ప్రాణం.

పెద్దల సభ రద్దుకు అసెంబ్లీ ఆమోదం

ఇటు జగన్, అటు కేసీఆర్ 15 ఏళ్లు దిగ్విజయంగా తెలుగు రాష్ట్రాలను పాలించాలని కోరుకుంటున్నా. అంతవరకు శారదాపీఠం తపస్సు చేస్తూనే ఉంటుంది.' గతంలో ఆయన వ్యాఖ్యానించారు.