Ratha Saptami Celebrations In Andhra Pradesh (Photo Credits: Twitter)

Tirumala,Febuary 01: ఏపీలో ఘనంగా రథసప్తమి వేడుకలు (Ratha Saptami Celebrations) జరుతున్నాయి. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చిమ్మ చీకట్లను తొలగించి, సమస్త లోకాలకు వెలుగును పంచేది సూర్య భగవానుడు.

ఈ ప్రత్యక్ష దైవం సూర్య భగవానుని పుట్టిన రోజును సమస్త జగత్తు రథసప్తమిగా (Ratha Saptami) జరుపుకుంటారు. ఏపీలో ప్రముఖ క్షేత్రాలుగా విరాజిల్లుతున్న తిరుమల,(Tirumala) అరసవిల్లి (Arasavalli) ఆలయాలు భక్తజన సందోహమయ్యాయి. ఈ రెండు ఆలయాల్లో రథసప్తమి వేడుకలను తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. అధికారులు భక్తులకు  ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

అరసవిల్లి సూర్యదేవాలయం

శ్రీకాకుళం (Srikakulam) అరసవిల్లి సూర్యదేవాలయం భక్తులు తో కిటకిటలాడుతోంది. దేశవ్యాప్తంగా వచ్చిన భక్తులు సూర్యజయంతి సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం చేసుకొని తరిస్తున్నారు. ఇంద్రపుష్కరణి వద్ద పాయసం వండి నైవేద్యాలు పెట్టి మొక్కుబడులు చెల్లిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ అధికార్లు పోలీస్, రెవిన్యూ, ఫైర్ సిబ్బంది సహకారం తీసుకున్నారు.

పండగలు ఎందుకు జరుపుకుంటారు?

అరసవల్లి సూర్యక్షేత్రం (Suryanarayana Temple) వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది. రథసప్తమిని పురస్కరించుకుని సుదూర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు శుక్రవారం రాత్రి సరికే అరసవిల్లి చేరుకున్నారు. ఆలయ పరిసరాల్లో, ప్రధాన రోడ్డుపైన భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులు వచ్చి స్వామి క్షీరాభిషేకం, నిజరూపాన్ని దర్శించుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలకు క్షీరాభిషేకం ప్రారంభమై.. శనివారం ఉదయం 8 గంటలకు ముగిసింది. తర్వాత నిజరూపంలో స్వామి దర్శనమిచ్చారు.

Here's Festival Video

తిరుమల శ్రీవారి ఆలయం

తిరుమల వేంకటాదివాసుడు ఏడాది పొడవు నా 450కి పైగా ఉత్సవాలు, సేవల్లో పూజలందుకుంటూ భక్తులను కటాక్షిస్తున్నారు.కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో రథ సప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. రథసప్తమిని పురస్కరించుకుని శ్రీవారికి ఒకే రోజు అన్ని వాహన సేవలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే దీపావళి

ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఉద‌యం 5.30 గంట‌ల‌కు మొదలైన సూర్యప్రభ వాహనసేవ ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోద‌యాన భానుడి తొలికిర‌ణాలు మ‌ల‌య‌ప్ప‌స్వామివారి పాదాల‌ను స్ప‌ర్శించాయి. ఈ ఘ‌ట్టం భ‌క్తుల‌కు క‌నువిందు చేసింది. సూర్యప్రభ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శించుకుంటే ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం లాంటి ఫలాలు సిద్ధిస్తాయి.

కర్రల సమరానికి సర్వం సిద్ధం

ఈ సంధర్భంగా రథసప్తమి పండుగ గురించి ఓ సారి తెలుసుకుందాం. అసలు సూర్యుని పుట్టిన రోజును సూర్య జయంతి అని పిలవాలి కానీ, రథ సప్తమి అని ఎందకు పిలుస్తారు? అసలు దీనికి కారణం ఏంటి అనేదానికి శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా సెలవిచ్చాడు.

‘‘సూర్యుని గమనం ఏడు గుర్రములు కలిగి, ఏక చక్రం కలిగిన బంగారు రథం మీద సాగుతుందని వేదము తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధాలు. సకల జగత్తుకి వెలుగునిచ్చే ఈ సూర్య భగవానుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని ఈ రోజున మార్చుకుంటాడని శాస్త్రం తెలుపుతుంది. ఆషాఢమాసము నుంచి పుష్యమాసం వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయనం దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అందుకు సూచికగా ఈ రోజున రథసప్తమిగా పిలుస్తారు.’’అని ధర్మరాజుకు ప్రభోదించాడు.

దేవునికి నైవేద్యం ఎలా సమర్పించాలి

రథ సప్తమిరోజున ఆవు నెయ్యితో దీపారాధన చేసినవారికి అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెపుతారు. ఈ పండుగ రోజున సూర్యకిరణాలు పడే తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి, దానిపై పిండితో పద్మం వేసి, పొయ్యి పెట్టి, పిడకలు, గొబ్బెమ్మలతో పోయ్యి వెలిగించి దాని మీద పాలు పొంగిస్తారు.

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు

తరువాత ఆ పాలల్లో కొత్తబియ్యం, బెల్లం, నెయ్యి, ఏలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు. తులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు.

ఎరుపు రంగు పూలతో..

రథసప్తమి పండుగ నాడు దేవుడిని ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది. ఈ రోజున బంగారము, వెండి, రాగితో ఏదైనా ఒకదానితో రథమును చేయించి, ఆ రథాన్ని కుంకుమ, దీపములతో అలంకరించి అందులో ఎర్రని రంగు గల సూర్యుని ప్రతిమను ప్రతిష్టించాలి. ఆ తరువాత దాన్ని పూజించి పండితులకు ఆ రథాన్నిదానము చేయాలి. ఈ రోజున ఉపవాసమును ఉండి దైవారాధనలోనే కాలం గడిపితే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుని అనుగ్రహం పొందుతారని పురాణాలు తెలిపాయి.

జిల్లేడు ఆకులతో నదీ స్నానం

ఇంతిటి శుభప్రదమయిన రోజునే ముత్తయిదువులు తమ నోములకు, వ్రతాలకు అంకురార్పణ చేస్తారు. ఇందులో చిత్రగుప్తుని నోము, ఉదయకుంకుమ నోము , పదహారఫలాల నోము, గ్రామకుంకుమ నోములను ఈ రోజు ప్రారంభిస్తారు. ఈ రోజు పుణ్యకార్యములు తలపెట్టిన విజయవంతగా పూర్తి అవుతాయన ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

మూడు రోజుల సంక్రాంతి సంబరం

సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ప్రీతి. అందువలన ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానము చేస్తే ఏడు జన్మలలో చేసిన పాపాలు అన్నీ నశిస్తాయని గర్గమహాముని తెలిపారు. అంతే కాదు ఏడు రకములైన వ్యాధులను కూడా నశింపజేస్తాయి. ఆ తరువాత అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని చేయాలని పురాణాలు చెపుతున్నాయి. ఇలా చేస్తే పుణ్యఫలాన్ని, అష్ట ఐశ్వర్యాలను, ఆయురారోగ్యాను పొంది సమస్త ప్రాణకోటి జీవిస్తుందని పురాణాలు చెపుతున్నాయి.