 
                                                                 East Godavari, Febuary 5: మహిళా రక్షణకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక 'దిశ' విభాగం ఏర్పాటు చేశామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ప్రతి పోలీసుస్టేషన్ మహిళామిత్రలా ఉండే ఏపీలో 18 'దిశ' స్టేషన్లు (Disha Police Station) ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేస్తామని ఏపీ డీజీపీ (Damodar Goutam Sawang) అన్నారు. ఆయన బుధవారం రాజమండ్రిలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు.
నిందితులకు 21 రోజుల్లోనే కఠిన శిక్ష పడేలా చట్టం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్లు చక్కగా ఉపయోగపడతాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు అర్బన్ జిల్లాలతో కలిపి 18 పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దిశ పోలీసు స్టేషన్‌లో ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, 38 కానిస్టేబుళ్లతో సహా పూర్తి స్థాయిలో స్టాఫ్ ఉండే విధంగా చూస్తున్నామని తెలిపారు.
రాత్రి 10 దాటితే ఉచితంగా డ్రాప్ సర్వీసు
దిశ పోలీసు స్టేషన్లు మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తాయని అన్నారు. త్వరలో దిశ యాప్ కూడా ప్రారంభం కానుందని.. దీని ద్వారా బయట ఉన్న మహిళలకు కూడా రక్షణ కల్పించే అవకాశం ఉంటుందని డీజీపీ గౌతంమ్ సవాంగ్ (DGP Goutham Savangh) తెలిపారు.
ఏపీ శాసనసభలో ఏపీ దిశ బిల్లుకు అమోదం
దేశంలో ఈ మధ్య ఎక్కడ చూసినా అత్యాచార ఘటనలే కనిపిస్తున్నాయి. మహిళలకు రక్షణ అనేది ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణాలో దిశ నిందితులను ఎన్ కౌంటర్ (Disha Encounter) చేసినప్పటికీ పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం (AP Government) దిశ పోలీస్ట్ స్టేషన్లను ఏర్పాటు చేయడం నిజంగా హర్షించదగ్గ విషయమే.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
