Bengaluru, December 8: దేశ వ్యాప్తంగా అమ్మాయిలపై జరుగుతోన్న దాడులు, అత్యాచారాల ఘటనలు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. తెలంగాణాలో దిశ రేప్ అండ్ మర్డర్ కేసు( Disha murder case), ఉన్నావ్ బాధితురాలి సజీవ దహనం (Unnao Rape Case) కేసులతో దేశంలో ప్రజల ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. మహిళలకు రక్షణ (Women's Protection) ఎక్కడ అంటూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ఎన్ కౌంటర్, ఉరి లాంటి కఠిన నిర్ణయాలను నిందితులపై వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. వెంటనే హెల్ప్ లైన్ (Help LIne) కి కాల్ చేయాలని కోరుతున్నారు.
free drop service for women
Karnataka: Gadag Police has started free drop service for women between 10 pm to 6 am. Srinath Joshi, SP Gadag says,"Women can call any police station or toll free helpline number. Police will pick them up and drop them off at their respective destinations." (7.12) pic.twitter.com/ybeGVRJy6V
— ANI (@ANI) December 8, 2019
ఇదిలా ఉంటే కర్ణాటక(Karnataka)లోని గదగ్ పోలీసులు (Gadag Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 10 దాటితే ఉచితంగా మహిళలను వారి ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని తెలిపారు. నిన్నటి నుంచే ఈ సేవలు ప్రారంభించామని అన్నారు. 'మహిళలు ఏ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసినా లేదా టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసినా ఈ సేవలు అందుతాయి.
ఫోన్ చేసిన వెంటనే పోలీసులు వచ్చి వారి వాహనంలో మహిళలను ఇంటి వద్ద ఉచితంగా డ్రాప్ చేస్తారు' అని గదగ్ ఎస్పీ శ్రీనాథ్ జోషి(SP Gadag Srinath Joshi) ఈ రోజు మీడియాకు తెలిపారు. నిన్న సాయంత్రం పలు ప్రాంతాలను వారు పరిశీలించి, మహిళల భద్రత విషయాన్ని పర్యవేక్షించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ సేవలు అందుకోవచ్చని చెప్పారు.