Krishna Water Row: మా నీళ్లను మేము తీసుకుంటున్నాం, దీనిపై రాజకీయాలు చేయడం తగదు, కృష్ణా జలాల అంశంపై స్పందించిన ఏపీ సీఎం వైయస్ జగన్
దీన్ని రాజకీయం ( (Krishna Water Row) చేయడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. తన నివాసంలో ఇరిగేషన్ అధికారుతో సమావేశమైన ఏపీ సీఎం కృష్ణా జలాల అంశంపై పలు విషయాలను వెల్లడించారు. రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో తాగడానికి కూడా నీళ్లులేని పరిస్థితి దాపురించిందన్నారు. ఎవరైనా మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలన్నారు
Amaravati, May 13: ఏపీ, తెలంగాణల మధ్య ఇప్పుడు నీటి గొడవ ప్రారంభమైంది. శ్రీశైలం ప్రాజెక్టు ( Srisailam Reservoir) నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh government) నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. అయితే దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana chief minister K Chandrasekhar Rao) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమన్నారు. ఏపీ సీఎం జగన్ చర్యపై టీఎస్ సీఎం కేసీఆర్ ఆగ్రహం, ఎత్తిపోతల పథకంపై ఏపీ నిర్ణయం తీవ్ర అభ్యంతరకరం అని వ్యాఖ్య, వెంటనే కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయాలని అధికారులకు ఆదేశం
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై వెంటనే కృష్ణా వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డులో (Krishna Water Dispute Tribunal) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ విషయంపై ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan Mohan Reddy) స్పందించారు. ఏపీకి కేటాయించిన నీటిని తీసుకోవడానికి అక్కడ ప్రాజెక్టు కట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దీన్ని రాజకీయం ( (Krishna Water Row) చేయడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. తన నివాసంలో ఇరిగేషన్ అధికారుతో సమావేశమైన ఏపీ సీఎం కృష్ణా జలాల అంశంపై పలు విషయాలను వెల్లడించారు. రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో తాగడానికి కూడా నీళ్లులేని పరిస్థితి దాపురించిందన్నారు. ఎవరైనా మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలన్నారు. లాక్‌డౌన్ 4కు సిద్ధమవండి, మే 18లోపు పూర్తి వివరాలు, కరోనాపై పోరాటంలో అలసిపోవద్దు, కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని, కేటాయింపులను దాటి ఏ రాష్ట్రం కూడా అదనంగా నీటిని వాడుకునే అవకాశం కూడా లేదని తేల్చి చెప్పారు. కృష్ణా బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశాకే నీటి కేటాయింపులు చేస్తుందని తెలిపారు. ఆ కేటాయింపుల పరిధిని దాటి నీటిని తీసుకెళ్లడానికి బోర్డు కూడా అంగీకరించదన్నారు.
ఏపీకి హక్కుగా కేటాయించిన నీటిని తీసుకోవడానికి పోతిరెడ్డిపాడు వద్ద ప్రాజెక్టు కట్టుకుంటున్నాం. శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ స్థాయిలో నీటిమట్టం సంవత్సరంలో సగటున 10 రోజులకు మించి ఉండడం మహా కష్టం. ఆ పది రోజుల్లోనే పోతిరెడ్డిపాడు ద్వారా కరువు పీడిత రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు వెళ్లాల్సి ఉంటుంది. రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజి, ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం చేయాల్సిందే, భారత్ సామర్ధ్యాన్ని ప్రపంచం నమ్ముతోంది, జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
అదే శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరితే 7వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లడం కష్టం. ఇక 841 అడుగులకు చేరితే వేయి క్యూసెక్కులు మాత్రమే నీరు వెళ్తుంది. కొత్తగా కడుతున్న వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా 2 టన్నెల్స్ నుంచి వెళ్లేది గరిష్టంగా 9వేల క్యూసెక్కుల నీరు మాత్రమే. అది కూడా శ్రీశైలంలో నీళ్లు 854 అడుగుల వద్ద ఉంటేనే ఆ మాత్రం నీళ్లైనా వెళ్తాయి" అంటూ ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న ప్రాజెక్టుల పరిస్థితిని సీఎం జగన్ వివరించారు. 54 వేల టికెట్లను జారీ చేసిన రైల్వే శాఖ, రైల్వే స్టేష్టన్‌లో ఆరోగ్య పరీక్షలు, ప్రతి ప్రయాణీకుల డేటా ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని తెలిపిన DG RPF Arun Kumar
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాజెక్టుల విషయాన్ని పరిశీలిస్తే...
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో నీళ్లు 800 అడుగుల స్థాయిలో కూడా రోజుకు 2 టీఎంసీల మేర ( 23,148 క్యూసెక్కుల నీరు) నీటిని తరలించవచ్చు. ఇలా 90 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నీటిని రోజుకు 0.3 టీఎంసీల (3,500 క్యూసెక్కుల) నీటిని తీసుకెళ్లగలరు. ఇలా 40 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు.ఇదే 800 అడుగుల స్థాయిలో దిండి నుంచి రోజుకు 0.5 టీంఎసీలను (5,787 క్యూసెక్కులు) తెలంగాణ తీసుకెళ్లగలదు. ఇలా 30 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు.
ఎస్‌ఎల్‌బీసీ ద్వారా అయితే శ్రీశైలంలో 824 అడుగులు నీటిమట్టం ఉన్నప్పుడు కూడా రోజుకు సుమారు 0.51 టీఎంసీ నీళ్లని (6,000 క్యూసెక్కులు) తెలంగాణ తరలించగలదు. అలా 40 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. పైన చెప్పిన ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుంచి సుమారు 200 టీఎంసీల నీటిని తీసుకునే సామర్థ్యం తెలంగాణకు ఉందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. దీనికి తోడు జూరాల, భీమ, నెట్టెంపాడు, కోయల్‌సాగర్‌ల నుంచి కూడా శ్రీశైలంలోకి నీళ్ళు రాకముందే తెలంగాణ నీళ్లు తీసుకోగలుగుతుందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ, సర్కార్ నుంచి వెళ్లే ప్రతి రూపాయి ప్రతి శ్రామికుడు, రైతు జేబులోకి, 21వ శతాబ్దం భారత్‌దేనని తెలిపిన ప్రధాని మోదీ
డబ్ల్యూడీటీ ప్రకారమే ఎవరు ఎన్నినీళ్లు వాడుకోవాలన్నది నిర్ణయించి, కృష్ణా రివర్ వాటర్ బోర్డు ఆ పంపకాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుందన్నారు. అలాంటప్పుడు ఎవరైనా దీన్ని రాజకీయం చేయడం కరెక్టు కాదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ తనకు కేటాయించిన నీటిని వాడుకోవడానికి, కరవు పీడిత రాయలసీమ ప్రాంతానికి తాగునీరు ఇవ్వడానికి ఒక సదుపాయం మాత్రమే ఏర్పాటు చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏపీకి పరిమితులు విధించాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోజు మానవత్వంతో ఆలోచించడం వల్లే... తెలంగాణ ప్రాంతంలో ఇదే శ్రీశైలం నుంచి పాలమూరు–రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల నిర్మాణానికి సన్నద్ధత కాని, కల్వకుర్తి, ఎల్‌ఎస్‌బీసీ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా గాని తక్కువ నీటిమట్టం ఉన్నప్పుడు కూడా నీళ్లు తెచ్చుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్ ఆ స్థాయిలో నీటిని ఎత్తిపోయడానికి ప్రాజెక్టులు ప్రారంభించారన్నారు.