Lockdown Violation in AP: ఏపీకి క్యూ కట్టిన తమిళనాడు, తెలంగాణ మందుబాబులు, అధికారులకు తెలియడంతో అక్కడ మద్యం అమ్మకాలు నిలిపివేత, దేశ వ్యాప్తంగా భారీగా క్యూ లైన్లు
మద్యం కొనుక్కొనేందుకు మద్యం ప్రియుల బారులు తీరారు. కాగా తమిళనాడులో మద్యం అమ్మకాలు జరగకపోవడంతో అక్కడినుంచి మందుబాబులు బార్డర్ దాటుకుని (TN Andhra border) చిత్తూరు జిల్లా పాలసముద్రానికి తరలిచ్చారు. మద్యం కొనుగోలు కోసం దుకాణాల మందు బుద్ధిగా బారులు తీరి మరీ నిలుచున్నారు. దాదాపు 40 రోజుల తర్వాత షాపులు ఓపెన్ కావడంతో మందుబాబులు క్యూకట్టారు.
Amaravati, May 4: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) నేటి నుంచి మద్యం దుకాణాలను తెరవడంతో పక్కనే ఉన్న తమిళనాడు, తెలంగాణ (Tamil Nadu and Telangana) రాష్ట్రాల నుంచి మందుబాబులు ఏపీలోకి ప్రవేశించారు. మద్యం కొనుక్కొనేందుకు షాపుల వద్ద మద్యం ప్రియులు బారులు తీరారు. తమిళనాడులో మద్యం అమ్మకాలు జరగకపోవడంతో అక్కడినుంచి మందుబాబులు బార్డర్ దాటుకుని (TN Andhra border) చిత్తూరు జిల్లా పాలసముద్రానికి తరలిచ్చారు. మద్యం కొనుగోలు కోసం దుకాణాల మందు బుద్ధిగా బారులు తీరి మరీ నిలుచున్నారు. దాదాపు 40 రోజుల తర్వాత షాపులు ఓపెన్ కావడంతో మందుబాబులు క్యూ కట్టారు. ఏపీకి ఎంఫాన్ రూపంలో తుపాను గండం, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, తుపాను పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం ఆదేశాలు
అయితే విషయం అధికారులకు తెలియడంతో అక్కడ మద్యం అమ్మకాలను నిలిపివేయాలని తమిళనాడు తహసీల్దార్లు ఏపీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దాంతో చిత్తూరు జిల్లా అధికారులు పాలసముద్రంలో మద్యం అమ్మకాలను నిలిపివేశారు.ఈ క్రమంలో కొన్నిచోట్ల తోపులాటలు చోటుచేసుకొన్నాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు సమీపంలోని వైన్ షాపుల దగ్గరు భారీగా తరలిరావడంతో కిలోమీటర్ల మేర క్యూలో నిలబడి మద్యాన్ని కొనుగోలు చేశారు.
Here's Lockdown violation Video
ఏపీలో మద్యం ధరలను ప్రభుత్వం 25శాతం పెంచిన విషయం తెలిసిందే. రద్దీ ఎక్కువగా ఉంటే షాపులను కొంతసేపు మూసివేస్తున్నారు. ఏపీలో మూడవ దశ లాక్‌డౌన్, గ్రీన్ జోన్లలో 25 శాతం పెంపుతో మద్యం అమ్మకాలు, కంటైన్‌మెంట్ క్లస్టర్ల ప్రాతిపదికగా సడలింపులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
ఇక నెల్లూరు జిల్లాలోని తడ మండలం బీవీ పాలెం, రామాపురం ప్రాంతాల్లోని మద్యం షాపుల వద్దకు తమిళులు భారీగా చేరున్నారు. ఒక్కసారిగా తమిళులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో వైన్ షాపుల వద్ద తోపులాట చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మద్యం షాపులను మూయించి పరిస్థితిని అదుపులోని తీసుకువచ్చారు. మద్యం షాపుల ముందు మందు బాబుల క్యూ, భౌతిక దూరం బేఖాతర్, మద్యం ధరలను 30 శాతం పెంచిన మమత సర్కారు, అదే బాటలో పలు రాష్ట్రాలు
ఇక తెలంగాణ నుంచి భద్రాచలం దగ్గర సరిహద్దులను దాటుకుంటూ తూర్పు గోదావరి జిల్లాల్లోకి తెలంగాణ మద్యం ప్రియులు వస్తున్నారు. భద్రాచలం పట్టణానికి అర కిలోమిటర్ దూరంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లాలోని ఎటకపాలెం గ్రామంలోకి మద్యం బాబులు చేరుకుని అక్కడ మద్యం కొనుగోలు చేశారు. దాదాపు కిలోమీటర్ మేర అక్కడ క్యూలైన్ కనిపించింది. నేటి నుంచి అమల్లోకి లాక్‌డౌన్ 3.0, దేశ వ్యాప్తంగా పలు ఆంక్షలు సడలింపు, కంటైన్‌మెంట్ క్లస్టర్లలో మరింత పటిష్టంగా చర్యలు
భారత్ మూడవ దశ లాక్డౌన్లోకి (India Lockdown 3.0) ప్రవేశించడంతో, ప్రభుత్వం అనేక సడలింపులను ఇచ్చింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు (Liquor Shops Open in Several Cities Across India) తెరుచుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మద్యం బాబులు షాపుల ముందు బారులు తీరారు. ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు గుమిగూడారు. ఇక మద్యం షాపుల (Liquor Shops) వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా, చాలా చోట్ల అమలు అవ్వడంలేదు.