PUBG Ban: పబ్‌జీ బ్యాన్, ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య, మరోచోట మొబైల్‌లో గేమ్ ఆడవద్దన్నందుకు బాలిక ఆత్మహత్య, కుటుంబాల్లో విషాదాన్ని నింపిన మొబైల్ వ్యసన ఘటనలు
ఈ నేపథ్యంలో బాటిల్ గ్రౌండ్ గేమ్ పబ్‌జీకి బానిసైన ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎడతెరిపిలేకుండా గేమ్‌లోనే మునిపోయే కిరణ్‌కుమార్‌రెడ్డి (23) పబ్ జీ బ్యాన్ తో తీవ్ర కుంగుబాటుకు గురయ్యాడు. అనంతపురం రెవెన్యూ కాలనీలోని తన నివాసంలో ఉరేసుకుని (Btech student hangs self) ప్రాణాలు తీసుకున్నాడు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది.
Anantapur, Sep 12: ఇటీవల కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ సహా 118 చైనా యాప్‌లపై నిషేధం (PUBG Ban) విధించింది. ఈ నేపథ్యంలో బాటిల్ గ్రౌండ్ గేమ్ పబ్‌జీకి బానిసైన ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎడతెరిపిలేకుండా గేమ్‌లోనే మునిపోయే కిరణ్‌కుమార్‌రెడ్డి (23) పబ్ జీ బ్యాన్ తో తీవ్ర కుంగుబాటుకు గురయ్యాడు. అనంతపురం రెవెన్యూ కాలనీలోని తన నివాసంలో ఉరేసుకుని (Btech student hangs self) ప్రాణాలు తీసుకున్నాడు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది.
ఇక చిత్తూరు జిల్లాలో మొబైల్‌లో గేమ్ ఆడవద్దన్నందుకు మనస్తాపానికి గురైన ఓ బాలిక ఇంటిలో ఉరేసుకుని బలవన్మరణం చెందింది. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు కిలపట్ల గ్రామానికి చెందిన మణికంఠ కుమార్తె చైత్ర(12) రాయలపేట గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కరోనా కారణంగా పాఠశాలలు మూత పడటంతో అప్పటి నుండి ఇంటి వద్దనే ఉంటోంది. అమ్మ చేస్తున్న ఇంటి పనుల్లో సహాయ పడక పోగా రోజూ మొబైల్‌లో గేమ్ ఆడుకుంటూ టైంకి సరీగా భోజనం కూడా చేసేది కాదు. టెన్సెంట్ గేమ్స్ తో సంబంధాలను తెంచుకున్న పబ్‌జీ కార్పొరేషన్, భారత చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పబ్‌జీ మొబైల్ గేమ్ ఉంటుందని వెల్లడి
మొబైల్‌లో గేమ్ ఆడొద్దంటూ అప్పుడప్పుడూ తల్లి మందలించేది. ఈ నేపథ్యంలో బాలిక గురువారం రాత్రి ఇంటి మిద్దెపైన రూమ్‌లో ప్యానుకు చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. బాలికను పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ బాలికకు చికిత్స అందించే లోపే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.