AP Election Commissioner Nimmagadda Ramesh Kumar | File Photo

Amaravati. June 9: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం రోజు రోజుకు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఆయనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జగన్ ప్రభుత్వం (YS Jagan Govt) దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే. అయితే ఈ ఈసారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ( Nimmagadda Ramesh Kumar) వ్యతిరేకంగా హైకోర్టులోనే ఓ పిటీషన్ దాఖలైంది. ఆయన నియామకాన్ని రద్దు చేయాలంటూ కోవారెంట్ పిటీషన్ (Quo Warranto petition) దాఖలైంది. ఏపీ హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. జగన్ సర్కారుకు మళ్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌‌ను కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు

నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ 2016లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో 11ను కొట్టేయాలని కోరుతూ గుంటూరు జిల్లా, ఉప్పలపాడు గ్రామానికి చెందిన సంగం శ్రీకాంత్‌రెడ్డి కో వారెంట్‌ రూపంలో ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో, ఏ అధికారంతో ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్నారో నిమ్మగడ్డ రమేశ్‌ను వివరణ కోరాలంటూ హైకోర్టును (AP High Court) అభ్యర్థించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం, నిమ్మగడ్డ కేసుపై న్యాయ‌ నిపుణుల‌తో సంప్రదింపులు జ‌రుపుతున్నామ‌ని తెలిపిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ముఖ్య కార్యదర్శి స్థాయికి తక్కువ కాని అధికారిని ప్రభుత్వ సిఫారసు మేరకు గవర్నర్‌ నియమించాలంటున్న ఏపీ పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 200 (2)ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతో పాటు దీనిని రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వర్తించకుండా నిమ్మగడ్డను నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన హైకోర్టును కోరారు. హైకోర్టు తీర్పు అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయండి, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం, స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన ఏపీ సర్కారు

కాగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నియామకం రాష్ట్ర మంత్రి మండలి సిఫారసు మేర జరగడానికి వీల్లేదని, పూర్తిగా రాష్ట్ర గవర్నర్‌ విచక్షణ మేరకే జరగాలంటూ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేశ్‌ నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలైంది.



సంబంధిత వార్తలు

Hyderabad Rain Videos: భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అవస్థల వీడియోలు ఇవిగో, రెండు గంటల పాటు హడలెత్తించిన వాన, రహదారులన్నీ జలమయం, భారీగా ట్రాఫిక జాం

Telugu States Rain Update: తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రానున్న 5 రోజులు పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

Andhra Pradesh Elections 2024: ఆకస్మిక బదిలీలే హింసకు కారణం, ఈసీకి నివేదిక సమర్పించిన సీఎస్, డీజీపీ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై వేటు

CM Jagan on Election Results: ఏపీలో మనం కొట్టే సీట్లతో ప్రశాంత్ కిషోర్ మైండ్ బ్లాక్ అయిపోద్ది, ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి

Post-Poll Violence In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ రక్తపాతం, సీరియస్ అయిన ఈసీ, వివరణ ఇవ్వాలంటూ చీఫ్ సెక్రటరీ & డీజీపీకి సమన్లు ​​జారీ

Andhra Pradesh Elections 2024: ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు, పోలింగ్ రోజు టీడీపీ కూటమికి మద్దతుగా వ్యవహరించారని ఆరోపణలు

Palnadu Road Accident: ప‌ల్నాడులో ప్రైవేట్ బ‌స్సులో చెల‌రేగిన మంట‌లు, ఆరుగురు స‌జీవ ద‌హ‌నం, ఓటు వేసి తిరిగి హైద‌రాబాద్ వ‌స్తుండ‌గా విషాదం

Andhra Pradesh Voting Percentage: ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ శాతం ఎంతంటే? జజిల్లాల వారీగా పోలింగ్ ప‌ర్సంటేజ్ లు విడుదల చేసిన ఎన్నిక‌ల సంఘం