YS Jagan Review Meeting: అక్కాచెల్లెమ్మలకు ఆస్తిని ఇద్దామంటే టీడీపీ అడ్డుపడుతోంది, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, స్పందన సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్
కరోనా సమయంలో ఇళ్లపట్టాలు ఎలా పంచుతారని టీడీపీ నేతలు కోర్టు గడట తొక్కడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa satyanarayana) తెలిపారు. కాగా వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8న రాష్ట్రంలో 30 లక్షలమంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం (Government of Andhra Pradesh) సిద్దమయింది.
Amaravati, July 7: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వైయస్సార్ హౌసింగ్ స్కీము (YSR Housing Scheme 2020) ఆగస్టు 15కి వాయిదా పడిన విషయం విదితమే. కరోనా సమయంలో ఇళ్లపట్టాలు ఎలా పంచుతారని టీడీపీ నేతలు కోర్టు గడట తొక్కడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa satyanarayana) తెలిపారు. కాగా వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8న రాష్ట్రంలో 30 లక్షలమంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం (Government of Andhra Pradesh) సిద్దమయింది. ప్రమాదానికి ప్రధాన కారణం అదే, విశాఖ గ్యాస్ లీకేజీపై ఏపీ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించిన హైపర్ కమిటీ, 4వేల పేజీల నివేదికలో కీలక విషయాలు కొన్ని మీకోసం
అయితే ఇళ్లస్థలాల పంపిణీని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు (TDP Leaders) వేసిన నాలుగు రిట్ పిటిషన్లపై న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చిందన్నారు. అయితే కరోనా వైరస్ పరిస్థితుల్లో న్యాయస్థానాల్లో ఇప్పటికిప్పుడు రివ్యూ పిటిషన్ వేసే అవకాశం లేనందున జూలై 8న పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయలేకపోతున్నామని చెప్పారు. టీడీపీ కుట్రలను తిప్పికొట్టి, న్యాయస్థానాల నుంచి అనుమతి తీసుకుని ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి (AP CM YS JAGAN) నిర్ణయించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. చంద్రబాబు మిలియన్ కరోనా టెస్టుల ట్వీటుకు రిప్లయి ఇచ్చిన ఏపీ హెల్త్ మినిస్ట్రీ, ప్రభుత్వానికి తప్పులు అంటగట్టడం సరైన పద్దతి కాదంటూ హితవు
స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ మంగళవారం వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్ష (AP CM YS Jagan Review) నిర్వహించారు. ఈ సమీక్షలో ఇళ్ల పట్టాల విషయం గురించి చర్చలు జరిపారు. పేదల ఇళ్ల పట్టాల కార్యక్రమానికి సుప్రీం కోర్టులో సానుకూల నిర్ణయం వస్తుందనే నమ్మకంతో ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దురదృష్టవశాత్తూ టీడీపీ నాయకులు ఇళ్ల పట్టాలపై కోర్టులకు వెళ్లారని.. కరోనా వైరస్(కోవిడ్-19) కారణంగా కేసులు పరిష్కారానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగష్టు 15 నాటికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆ రోజే పేదలకు కూడా స్వాతంత్ర్యం వస్తుందని అనుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో త్వరలో గ్రేహౌండ్స్ నిర్మాణం, వెల్లడించిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, కరోనా కష్టకాలంలో ఏపీ పోలీసులు పనితీరు అద్భుతమని ప్రశంస
అయితే డీ- పట్టాల కింద ఇవ్వాలనుకుంటే ఈ రోజైనా ఇవ్వొచ్చని, అయితే డీ- పట్టాల రూపంలో కాకుండా రిజిస్ట్రేషన్ చేసి అక్కాచెల్లెమ్మలకు ఇవ్వగలిగితే వారికి ఆస్తి ఇచ్చినట్టు అవుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. మంచి ఆలోచనతో పని చేస్తున్నామని.. ఎల్లప్పుడూ ధర్మమే గెలుస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. పేద రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, సన్న, చిన్న కారు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా స్కీమ్ కింద ఉచిత బోర్ పథకం, అర్హతలు ఇవే
ఏపీలో 20 శాతం మంది జనాభాకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. 30 లక్షల మందిని ఇళ్ల యజమానులుగా చేస్తున్నాం. మంచి కార్యక్రమాన్ని దేవుడు ఎప్పటికైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇళ్ల పట్టాల కింద 62వేల ఎకరాలు సేకరించాం. పేదల ప్రజల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ప్రైవేటు భూముల కొనుగోలుకే సుమారు రూ.7500 కోట్లు ఖర్చుచేశాం. మొత్తంగా దాదాపు రూ.20వేల కోట్ల విలువైన ఆస్తిని 30 లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదన్నారు.