Image used for representational purpose. | Photo Wikimedia Commons

Amaravati, July 6: పలు సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (Andhra Pradesh CM YS jagan) రాష్ట్రంలోని పేద రైతుల కోసం మరో పథకాన్ని తీసుకువచ్చారు. ఇప్పటికే విద్య, వైద్యం, ఆరోగ్యంలో అనేక విప్లవాత్మక మార్పులు చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవసాయంలోనూ పలు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని సన్న, చిన్న కారు రైతులకు ఆదుకునేందుకు ఉచిత బోరు పథకాన్ని (Free Borewells for Farmers) ప్రవేశపెట్టింది. విశాఖపట్నంలో త్వరలో గ్రేహౌండ్స్ నిర్మాణం, వెల్లడించిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, కరోనా కష్టకాలంలో ఏపీ పోలీసులు పనితీరు అద్భుతమని ప్రశంస

ఇప్పటికే అమల్లో ఉన్న ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ (YSR Rythu Bharosa scheme) కింద రైతుల పంటపొలాల్లో ఉచితంగా బోర్లు వేయాలని ప్రభుత్వం సంకల్పించింది. 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఉచిత బోర్లు వేయించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. అర్హత గల రైతులు గ్రామ సచివాలయంలో పట్టాదారు పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డుల ఆధారంగా దరఖస్తు చేసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.

అర్హతలు, విధివిధానాలు

రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి ఉండాలి. అంత భూమి లేకపోతే పక్కనున్న రైతులతో కలిసి గ్రూపుగా ఏర్పడవచ్చు. ఒక రైతుకు గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండవచ్చు. ఈ అర్హతలు ఉన్న రైతులు బోరు బావి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అంతకు ముందు ఆ భూమిలో ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు. అర్హత కలిగిన లబ్ధిదారుడు పట్టాదార్‌ పాస్‌ బుక్, ఆధార్‌ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో లేదా నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పంచాయతీ కార్యదర్శి క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం తదుపరి అనుమతికి ఎంపీడీవోకు ఆ దరఖాస్తు వెళుతుంది. జిల్లా మొత్తంలో ఎంపిక చేసిన రైతుల జాబితాలను డ్వామా పీడీలకు ఎంపీడీవోలు అందజేస్తారు. బోరు బావి మంజూరు అనంతరం ఆ సమాచారాన్ని గ్రామ సచివాలయం ద్వారా రైతుకు తెలియజేస్తారు.