
Amaravati, July 6: కోవిడ్-19 కష్టకాలంలో పోలీసుల పనితీరు అద్భుతమని, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 24 గంటలూ విధులు నిర్వహించారని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ (AP DGP Gautam Sawang) కొనియాడారు. విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 78 వేల మంది పోలీస్ సిబ్బందిని (police department) అభినందించారు. ఈ సమావేశంలో ప్రధానంగా మావోయిస్టుల కార్యకలాపాలపై పోలీస్ శాఖ అప్రమత్తత గురించి చర్చ జరిగిందని డీజీపీ (Damodar Goutam Sawang) తెలిపారు. ఏపీలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు, బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, కోస్తా, రాయలసీమలపై చురుగ్గా నైరుతి రుతుపవనాల ప్రభావం
ఏపీలో (Andhra Pradesh) జూన్ నుంచి కరోనా కేసులు పెరిగాయి. పోలీస్ శాఖలో ఇప్పటివరకూ 466 మందికి కరోనా పాజిటివ్ ( Coronavirus outbreak) వచ్చింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రం మరింత అప్రమత్తంగా ఉంది. ముందుండి పని చేస్తున్న సిబ్బందికి మరిన్ని జాగ్రత‍్తలు తీసుకుంటున్నాం. కరోనానను ఎదుర్కొనటంలో ఏపీ పోలీస్ శాఖ ఛాలెంజింగ్‌గా తీసుకుంది’ అని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 466 మంది పోలీసులకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 10 లక్షలు దాటిన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావో ప్రభావిత ప్రాంతాల్లో గంజాయి సాగవుతోంది. ఆదాయం సమకూర్చుకోవడానికి మావోయిస్టులే గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారు.సెబ్ గంజాయి సాగుపై ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో ఎక్సైజ్ సిబ్బంది కూడా గంజాయి సాగు నియంత్రణకు ఆయుధాలు ఇవ్వాలనే ఆలోచన వచింది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర బలగాలు ఆయుధాలతో నిఘా ఉన్నాయి. కోవిడ్ లాక్‌డౌన్ కాలంలో గంజాయి వ్యాపారం కొంచెం తగ్గిందని తెలిపారు.కాగా గతంలో గోవా, బెంగుళూర్ నుండి డ్రగ్స్ సరఫరా జరిగేవని ఇప్పుడు గోవా లాక్‌డౌన్‌తో బెంగుళూరు నుండి సరఫరా అవుతున్నట్లు గుర్తించామని డీజీపీ తెలిపారు.
విభజన చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గ్రేహౌండ్స్ కోసం 384 ఎకరాలను విశాఖపట్నంలోని ఆనందపురంలో కేటాయించింది. అక్కడ స్థల పరిశీలన చేశాం. తర్వలోనే నిర్మాణం చేపడతాం. దేశంలోనే ఏపీ గ్రేహౌండ్స్ ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నది మా ఉద్దేశ్యమని గౌతం సవాంగ్ అన్నారు.