Rain Alert in AP: ఏపీలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు, బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, కోస్తా, రాయలసీమలపై చురుగ్గా నైరుతి రుతుపవనాల ప్రభావం
heavy-rainfall-warning-to-telangana(Photo-ANI)

Amarvati, July 6: ఏపీలో రానున్న మూడు రోజులు పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Rain Alert in AP) కురవనున్నాయి. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ఒడిశా, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమబెంగాల్‌ తీరాలకు సమీపంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 10 లక్షలు దాటిన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు

దీనికి అనుబంధంగా ఈ ప్రాంతంలో 7.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ఏర్పడటంతో కోస్తా, రాయలసీమలపై నైరుతి రుతుపవనాల ప్రభావం చురుగ్గా కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈ అల్పపీడన ప్రభావంతో.. కోస్తా, రాయలసీమల్లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Heavy rains in AP) కురిసే అవకాశముంది. ఈ నెల 7, 8 తేదీల్లో ఉత్తరాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. తీరం వెంబడి నైరుతి దిశగా ఉత్తర కోస్తా తీరంలో (Coastal Andhra Pradesh) నేడు, రేపు గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. అదేవిధంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరంలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి.

అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం ఏర్ప డటంతో సముద్రం అల్లకల్లోలంగా ఉండనుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకు వెళ్లకూడదని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వానలు కురిశాయి.