Govt to downgrade Chandrababu Naidu's security cover: Andhra Pradesh DGP (Photo-Instgram)

Amaravati, July 6: ఏపీలో పది లక్షల కరోనా టెస్టులు చేశామని ప్రభుత్వం ప్రకటించడంతో దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించిన సంగతి విదితమే. మొదటి నుంచి జగన్ ప్రభుత్వం (YS Jagan Govt) ప్రజలను మోసం చేస్తూనే ఉందని, కరోనా పరీక్షల గణాంకాల విషయంలో కేంద్రాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తోందని ట్విట్టర్ (Twitter)ద్వారా విమర్శించారు.దీనికి ఏపీ హెల్త్ మినిస్ట్రీ (AP Health Ministry) రిప్లయి ఇచ్చింది.  ఏపీలో కొత్తగా 1322 కరోనా కేసులు, ఏడు మంది మృతి, రాష్ట్రంలో 20 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, 239కి చేరిన మృతుల సంఖ్య

కరోనా పరీక్ష చేయించుకున్న వ్యక్తి సంబంధిత అధికారులకు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చాడో ఆ ఫోన్ నెంబర్ కే ఫలితాలతో కూడిన ఎస్సెమ్మెస్ వెళుతుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ కరోనా టెస్టులు చేయించుకున్న వ్యక్తి తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చినా, లేక మరొకరి నెంబర్ ఇచ్చినా ఆ నెంబర్ కే ఎస్సెమ్మెస్ వెళుతుందని వివరించింది. కరోనా టెస్టుల ఫలితాలను సత్వరమే తెలియజేసి ప్రజల్లో భయాందోళనలు తగ్గించడానికి వీలుగా వినూత్నరీతిలో ఈ ఎస్సెమ్మెస్ విధానాన్ని తీసుకువచ్చామని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Here's BabuTweet and AP Govt Reply Tweet

అయితే, ఒక మిలియన్ సందేశాల్లో ఏవో కొన్ని సందేశాలను తప్పుబట్టడం, అది కూడా ప్రభుత్వం వైపు నుంచి పొరబాటు లేకపోయినా ప్రభుత్వానికి తప్పులు అంటగట్టడం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో సరైన పద్ధతి అనిపించుకోదని హితవు పలికింది. ఆంధ్రప్రదేశ్‌లో 10 లక్షలు దాటిన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు

కాగా"అనంతపురం నుంచి ఒక వీడియో వచ్చింది. కరోనా పరీక్షల కోసం శాంపిల్ ఇవ్వని వ్యక్తులకు కూడా కరోనా టెస్టుల్లో మీ ఫలితం ఇదీ అంటూ ఫోన్లకు సందేశాలు వస్తున్నట్టు ఆ వీడియోలో చెబుతున్నారు. ఈ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మరీ ఇంత నీచానికి దిగజారుతుందన్న విషయం దిగ్భ్రాంతి కలిగించింది. ఏపీ సర్కారు చెబుతున్న ఒక మిలియన్ కొవిడ్ టెస్టుల ( 'One Million COVID tests') గణాంకాలు వట్టి మాయ అయినా అయ్యుండాలి లేకపోతే ఓ కుంభకోణం అయినా అయ్యుండాలి. నేను కేంద్రానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను... వెంటనే ఈ విషయాన్ని పరిశీలించండి. టెస్టులు చేశామంటూ ఫోన్లకు సందేశాలు పంపే ప్రభుత్వ ప్రోద్బలిత రాకెట్ వెనుకున్న మోసపూరిత ఉద్దేశాలను బయటపెట్టండి" అంటూ చంద్రబాబు ట్విట్టర్ లో విజ్ఞప్తి చేశారు.