Coronavirus outbreak in India (Photo Credits: IANS)

Amaravati, July 6: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం మరో 1322 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు (AP Coronavirus Report) నమోదయ్యాయి. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 56 మందికి, విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా (new positive cases) నిర్థారణ అయింది. ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ (Andhra Pradesh Medical Department) విడుదల చేసింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 16,712 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం 1,322 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. పేద రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, సన్న, చిన్న కారు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా స్కీమ్ కింద ఉచిత బోర్ పథకం, అర్హతలు ఇవే

దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,019కి చేరింది. ఇక గడచిన 24 గంటల్లో 424 మంది కోవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 239కి చేరింది. ఈ రోజు మృతి చెందిన ఏడుగురిలో శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,860 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి.

Here's AP Covid Report

ఏపీ మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యాలయంలో 33 మందికి కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా, అమరావతి రోడ్డులో ఉన్న మహిళా శిశుసంక్షేమ రాష్ట్ర కార్యాలయంలో ఒకే రోజు 33 మంది ఉద్యోగులకు పాజిటీవ్ వచ్చింది. ముందు ఈ కార్యాలయంలో రాష్ట్ర డైరెక్టర్‌కు పాజిటీవ్ వచ్చింది. దీంతో ఆఫీసులో ఉండే 120 మంది ఉద్యోగులకు పరీక్షలు చేయగా.. 33 మందికి పాజిటీవ్ నిర్ధారణ అయింది. దీంతో కార్యాలయాన్ని మూసివేశారు. మిగతా శాఖల ఉద్యోగులు అప్రమత్తమయ్యారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా 23 కంటైన్ మెంట్ జోన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఏలూరులో మూడు ప్రాంతాల్లో కొత్త కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, పెదపాడు మండలాల్లో మూడు కంటైన్ మెంట్ జోన్లను ఎత్తివేశారు.