IPL Auction 2025 Live

Telugu States Coronavirus: ఏపీలో కొత్తగా 60 కేసులు, తెలంగాణలో తాజాగా 6 కేసులు, మూడవ దశ లాక్‌డౌన్ మే 17 వరకు పొడిగించిన కేంద్రం

ప్రభుత్వాలు ఎంతగా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంలేదు. ఏపీలో శుక్రవారం ఉదయానికి తాజాగా 60 కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు (Telangana Coronavirus) నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు.

Coronavirus in India | (Photo Credits: PTI)

Amaravati, May 1: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు (Telugu States COVID-19) రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎంతగా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంలేదు. ఏపీలో  శుక్రవారం ఉదయానికి కొత్తగా 60 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, పట్టాలెక్కనున్న 400 శ్రామిక స్పెషల్ రైళ్లు, కేంద్ర రైల్వే శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఇవే

ఏపీ రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసులు 1463కు చేరుకున్నాయి. 403 మంది డిశ్చార్జ్ కాగా..33 మంది మరణించారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 1027గా తెలిపింది.

జిల్లాల వారీగా కేసులను పరిశీలిస్తే.. అనంతపురం 67. చిత్తూరు 80. ఈస్ట్ గోదావరి 42. గుంటూరు 306. కడప 79. కృష్ణా 246. కర్నూలు 411. నెల్లూరు 84. ప్రకాశం 60. శ్రీకాకుళం 5. విశాఖపట్టణం 25. విజయనగరం 0. వెస్ట్ గోదావరి 58గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 7902 శాంపిల్స్ పరీక్షించగా..60 మందికి పాజిటివ్ ఉందని తేలింది.  మద్యం షాపులు తెరుచుకోవచ్చు, గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హోం శాఖ, మే 4 నుంచి 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

ఇక తెలంగాణలో కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు (Telangana Coronavirus) నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. శుక్రవారం నమోదైన 6 కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,044కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న 24 మంది బాధితులు ఇవాళ డిశ్చార్జి అయ్యారు. లాక్‌డౌన్‌ను తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా అమలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.  గుజరాత్ సీఎంకు ధన్యవాదాలు తెలిపిన ఏపీ సీఎం జగన్, భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య ఇదే సహకారం కొనసాగుతుందని ఆశాభావం

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ మరో 2 వారాల పాటు పొడిగిస్తున్నట్లు (Lockdown 3.0) కేంద్రం ప్రకటించింది. మే 4వ తేదీ నుంచి మే 17 వరకు రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ (India lockdown) అమల్లో ఉండనుంది. రెండో దఫా లాక్‌డౌన్‌ గడువు మే 3తో ముగియనుండటంతో కేంద్ర హోంశాఖ (Home Ministry) లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది.ఇక శనివారం ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. కరోనా కట్టడి కొనసాగింపు చర్యలపై మోదీ స్పష్టత ఇవ్వనున్నారు.