LPG Cylinder Price Hike: గ్యాస్‌ మంట.. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరపై రూ.21 పెంపు.. హైదరాబాద్‌లో రూ.2024.5కు చేరిన గ్యాస్ బండ ధర

దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ (Commercial Gas Cylinder) ధరను రూ.21 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

Commercial LPG (File: Google)

Hyderabad, Dec 1: గ్యాస్‌ సిలిండర్‌ (Gas Cylinder) వినియోగదారులకు షాక్ కలిగించే వార్త ఇది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ (Commercial Gas Cylinder) ధరను రూ.21 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. కాగా, గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌ ధరలు పెరగకపోవడం ఒకింత ఉపశమనం లభించినట్లే.

Cyclone Michaung: ఏపీకి తుఫాను ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం, త్వరలో తుఫాను బలపడనున్న వైనం.. నేటి నుంచి మూడు నాలుగు రోజుల పాటు కోస్తాతో పాటు రాయలసీమలోనూ వర్షాలు.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరిక

ఎక్కడ ఎంత?

తాజా పెరుగుదలతో ఢిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1796.50కు చేరింది. ఇక కోల్‌కతాలో రూ.1908, ముంబైలో రూ.1749, చెన్నైలో రూ.1968.50కు పెరిగింది. ఇక ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో రాజధానులైన జైపూర్‌ (రాజస్థాన్‌) రూ.1819, భోపాల్‌ (మధ్యప్రదేశ్‌) రూ.1804, రాయ్‌పూర్‌ (ఛత్తీస్‌గఢ్‌) రూ.2004, హైదరాబాద్‌లో రూ.2024.5గా ఉన్నది.

TS Elections Polling: తెలంగాణ ఎన్నికల్లో 70.66 శాతం పోలింగ్.. మునుగోడులో అత్యధికంగా 91.51 శాతం.. అత్యల్పంగా యాకుత్‌ పురా లో 39.9 శాతం పోలింగ్



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif