Hospital Horror: కంటిలో నలక పడిందని వస్తే, సర్జరీ అన్నారు.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి చిన్నారిని పొట్టనబెట్టుకున్నారు.. హైదరాబాద్ లో ప్రైవేటు కంటి దవాఖాన ముందు బంధువుల ఆందోళన (వీడియో)

బిడ్డ కంటిలో నలక సమస్యతో హాస్పిటల్ ను ఆశ్రయించిన ఆ తల్లిదండ్రులకు చివరకు కడుపుకోతే మిగిలింది.

Child died in Hospital (Credits: X)

Hyderabad, Nov 23: హైదరాబాద్ (Hyderabad) లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో (Private Hospital) దారుణం జరిగింది. బిడ్డ కంటిలో నలక సమస్యతో హాస్పిటల్ ను ఆశ్రయించిన ఆ తల్లిదండ్రులకు చివరకు కడుపుకోతే మిగిలింది. కంటిలో నలక సమస్యకు సర్జరీనే పరిష్కారం అంటూ ఆ చిన్నారికి డాక్టర్లు మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో కాసేపటికే ఆ చిట్టి గుండె ఆగిపోయినట్లు బంధువులు తెలిపారు. దీంతో తమకు న్యాయం చేయాలని హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కంటిలో నలక పడిందని చిన్నారి అన్విక(5)ను ఆమె తల్లిదండ్రులు నగరంలోని ఆనంద్ ఐ ఇన్‌స్టిట్యూట్ హాస్పిటల్ లో చేర్పించారు.

మ‌హారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ షురూ.. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే హవా.. కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలివే (లైవ్)

Here's Video:

నలకను తీసేయాలంటే సర్జరీ

పాపను పరీక్షించిన వైద్యులు కంటిలో నలకను తీసేయాలంటే సర్జరీ చేయాలని సూచించారు. ఈ క్రమంలో సర్జరీ చేసే ముందు మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో కాసేపటికే పాప హార్ట్ బీట్ ఆగిపోయింది. దీంతో కంగారుపడ్డ వైద్యులు పాప తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే ఎల్బీనగర్ రెయిన్‌ బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ కు అన్వికను తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు  పాప స్పృహలో లేదని, మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో తమ బిడ్డను హాస్పిటల్ వాళ్లే చంపేశారని, తమకు తగిన న్యాయం చేయాలని ఆనంద్ హాస్పిటల్ ముందు పాప తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు.

దటీజ్ కేసీఆర్, కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు బ్రేక్...గులాబీ బాస్ వ్యూహంతో వెనక్కి తగ్గిన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో టచ్‌లోకి పార్టీ మారిన ఎమ్మెల్యేలు!