తెలంగాణ

Road Accident in Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టిన టిప్పర్..ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..

Team Latestly

నాగర్‌కర్నూల్ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అచ్చంపేట మండలం చెన్నారం స్టేజ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అచ్చంపేట నుండి హైదరాబాద్‌ దిశగా వెళ్తున్న కారును ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన దెబ్బకు కారు రోడ్డుపై బోల్తాపడి పూర్తిగా ధ్వంసమైంది.

Chevella Bus Accident: టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడం వ‌ల్లే బస్సు ప్ర‌మాదం, చేవెళ్ల బస్సు ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి, 20 మంది మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు

Team Latestly

రంగారెడ్డి జిల్లాలో సోమవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం పీర్జాగూడ ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌ లారీ ఢీ కొట్టి బస్సు మీద బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. క్షతగాత్రులకు చికిత్స అందుతుండగా.. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Cyclone Montha Update: తీరం దాటిన మొంథా తుఫాను, తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 24 గంటల పాటు భారీ వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచే కుండపోతగా వర్షం

Team Latestly

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన తుపాను ‘మొంథా’ (Montha Cyclone) మంగళవారం అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. వాతావరణశాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం, మచిలీపట్నం–కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా ఉన్న నరసాపురం వద్ద తుపాను తీరం దాటింది.

Narrow Escape in Hyderabad: గుండెలు ఝలదరించే వీడియో ఇదిగో, కదులుతున్న రైలు నుంచి దిగుతూ జారిపడిన ప్రయాణికుడు, వెంటనే ముందుకు దూకి కాపాడిన తోటి ప్రయాణికులు

Team Latestly

హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి దిగడానికి ప్రయత్నిస్తూ జారిపడిన ఒక వ్యక్తి ఘోర ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు. అక్టోబర్ 26న జరిగిన ఈ సంఘటన సీసీటీవీలో రికార్డైంది, వరంగల్‌కు చెందిన 31 ఏళ్ల మణిదీప్‌గా గుర్తించబడిన ఈ ప్రయాణికుడు బ్యాలెన్స్ కోల్పోయి రైలు కింద పడిపోతున్నట్లు చూపబడింది.

Advertisement

Karimnagar Road Accident: వీడియో ఇదిగో.. కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొట్టుకున్న రెండు బైక్‌లు, ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు

Team Latestly

కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ స్టేజ్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం ప్రాంతంలో కలకలం రేపింది. రహదారిని దాటుతున్న సమయంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రమాద తీవ్రతతో రెండు బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.రెండు బైకులు కూడా అధిక వేగంతో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక బైక్ రోడ్డు దాటుతుండగా, మరొకటి ఎదురుగా వస్తూ బలంగా ఢీకొట్టింది.

Telangana Shocker: వీడియో ఇదిగో.. పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ పైనుండి దూకిన యువకుడు, టవర్ కింద బురదలో పడడంతో తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘటన

Team Latestly

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆదివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. తనకు పెళ్లి చేయాలని ఒత్తిడి చేస్తూ ఒక యువకుడు హైటెన్షన్ విద్యుత్ టవర్‌పైకి ఎక్కి దూకాడు. స్థానికులు అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నించినా, అతడు వినిపించుకోకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు మరియు విద్యుత్ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.

Kurnool Bus Fire Video: మంటల్లో కాలిపోతున్న కావేరి ట్రావెల్స్‌ బస్సు వీడియో ఇదిగో, అందరూ చూస్తుండగా క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైన ప్రైవేట్ బస్సు, హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన

Team Latestly

కర్నూల్‌ జిల్లాలోని చిన్నటేకూరు వద్ద కావేరి ట్రావెల్స్‌ బస్సు (Bus Fire Accident) ఘోర ప్రమాదానికి గురైన సంగతి విదితమే. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు చిన్నటేకూరు వద్ద ఓ బైక్‌ను ఢీకొట్టింది. తర్వాత డ్రైవర్‌ బస్సును ఆపకుండా సుమారు 300 మీటర్ల దూరం బైను అలాగే తీసుకెళ్లాడు. దీంతో మంటలు చెలరేగి బస్సు ముందు భాగంలో అంటుకున్నాయి.

Kurnool Bus Fire Accident: కర్నూలు బస్సు ప్రమాదం, మృతుల కుటుంబాలకు 5 లక్షలు పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం

Team Latestly

కర్నూలు కావేరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాద ఘటనలో (Kurnool Bus Fire Tragedy) మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

IMD Alert: వచ్చే వారం రోజుల పాటు భారీ వర్షాలు, అనేక రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక, తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్

Team Latestly

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు ఈ రోజు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య వాయుగుండగా బలపడే అవకాశముంది. దీని ప్రభావంతో రాబోయే వారంలో దక్షిణ, తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తృతమైన వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వివరణాత్మక హెచ్చరిక జారీ చేసింది.

SC Verdict on BC Reservation: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు, హైకోర్టులో విచారణ సాగుతున్నందున పిటిషన్‌ను స్వీకరించబోమని స్పష్టం

Team Latestly

తెలంగాణ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించిన అంశంపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Hyderabad: వీడియో ఇదిగో, తమ ఇంటి ముందు బైకులు పార్క్ చేయొద్దని చెప్పినందుకు దంపతులపై 30 మంది హాస్టల్ యువకులు దాడి, కేసు నమోదు చేసిన పోలీసులు

Team Latestly

కూకట్‌పల్లిలోని కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 5లోని ఒక నివాస ప్రాంతంలో తమ ఇంటి ముందు బైకులు పార్క్ చేయొద్దని కోరిన దంపతులపై 30 మంది హాస్టల్ యువకులు దాడి చేశారు. దాడికి ముందు దంపతులు హాస్టల్ విద్యార్థులను మా ఇంటి ముందు బైక్ పార్క్ చేయొద్దని అడిగారు. అయితే వారిలో కొంతమంది స్పందించకపోవడంతో తలెత్తిన విరోధం దాడి రూపానికి చేరింది

Telangana Local Body Elections: తెలంగాణ లోకల్‌ బాడీ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు, ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు

Team Latestly

తెలంగాణ హైకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ లోకల్‌ బాడీ ఎన్నికలను నిలిపివేస్తూ, అలాగే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 పై కూడా హైకోర్టు స్టే విధించింది.

Advertisement

Cough Syrup Deaths: దగ్గు మందుతో పెరుగుతున్న మరణాలు, మరో రెండు దగ్గు మందులను బ్యాన్‌ చేసిన తెలంగాణ ప్రభుత్వం, లిస్టులో ఏ సిరప్స్ ఉన్నాయంటే..

Team Latestly

తెలంగాణ రాష్ట్రంలో చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఔషధ నియంత్రణ విభాగం (DCA) ద్వారా కొన్ని దగ్గు సిరపులపై నిషేధాలు విధించారు. ఈ నిర్ణయం ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని చిన్నారుల దగ్గు మందుల వల్ల గల్లంతైన ఘటనల నేపథ్యంలో తీసుకుంది ప్రభుత్వం.

IMD Alert: తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా మారిపోయిన వాతావరణం, మరో మూడు రోజుల పాటు ఎండలతో కూడిన వానలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, హైదరాబాద్ వాసులకు హైఅలర్ట్

Team Latestly

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వాతావరణం అస్తవ్యస్తంగా మారిపోయింది. పగలంతా ఎండ కాసి, సాయంత్రం ఆకస్మిక వర్షాలు కురిసే పరిస్థితి నెలకొంది. ఈ తారుమారైన వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో వచ్చే రెండు రోజులు వర్షాల తీవ్రత మరింత పెరగవచ్చని సూచించింది.

Jubilee Hills By-poll Schedule: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ, నవంబర్‌ 11 వ తేదీన ఉప ఎన్నిక, 14వ తేదీన కౌంటింగ్‌, అదే రోజు ఫలితాలు విడుదల

Team Latestly

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 13వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయి 21వ తేదీ వరకు స్వీకరించనున్నారు.

SC on OBC Reservation: బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి సర్కారుకు ఊరట, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున జోక్యం చేసుకోలేమని స్పష్టం

Team Latestly

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీఓ నంబర్ 9పై దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది.

Advertisement

Hyderabad: మాదన్నపేటలో దారుణం, కుక్క విషయంలో గొడవపడి వృద్ధురాలిపై కానిస్టేబుల్‌ కుటుంబసభ్యులు దాడి, వీడియో ఇదిగో..

Team Latestly

హైదరాబాద్‌ నగరంలోని మాదన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. కుక్కను తీసుకొచ్చి తమ ఇంటి ముందు మలవిసర్జన చేయిస్తున్నారని ప్రశ్నించిన వృద్ధురాలిపై కానిస్టేబుల్ కుటుంబసభ్యులు దారుణంగా దాడి చేసి గాయపరిచారు. తన ఇంటి ముందు, పోలీస్ కానిస్టేబుల్ కుక్కకు మలవిసర్జన చేయిస్తున్నాడని వృద్ధురాలు ప్రశ్నించింది.

Hyderabad New CP: హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్‌, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా బదిలీ అయిన సీవీ ఆనంద్‌

Team Latestly

Telangana Panchayat Elections 2025: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల, మొత్తం ఐదు దశల్లో పోలింగ్‌, 565 జడ్పీటీసీ, 5,749 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

Team Latestly

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల (Local Body) ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది. మొదట ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముది ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఎన్నికలు మొత్తం ఐదు విడతల్లో నిర్వహించనున్నారు.

V.C. Sajjanar: టీజీఎస్ఆర్టీసీ ఎండీగా చివరి రోజు బస్సులో ప్రయాణించిన సజ్జనార్, బస్సు దిగి కొత్త మార్గంలో వెళ్లవలసి ఉందంటూ భావోద్వేగం, హైదరాబాద్ సీపీగా తదుపరి బాధ్యతలు

Team Latestly

నాలుగు సంవత్సరాలుగా టీజీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన వీసీ సజ్జనార్ ఈ రోజు బాధ్యతల నుంచి తప్పుకుని కొత్త బాధ్యతలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో సజ్జనార్ 'ఎక్స్' వేదికగా స్పందించారు

Advertisement
Advertisement