BJP Nirudyoga Deeksha: సీఎం కేసీఆర్ పిరికిపంద అంటూ ఈటెల విమర్శ, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టేది బండి సంజయ్ అంటున్న అరవింద్, దీక్ష సమయంలో బాత్రూంలో ఇడ్లీలు తిన్న చరిత్ర కేసీఆర్‌ది అంటూ బండి సంజయ్ విమర్శలు

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు.బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ దీక్షలో ఈటల మాట్లాడుతూ కేసీఆర్‌ను గద్దె దించటానికి విద్యార్థులు, యువత, నిరుద్యోగులు కలిసిరావాలని పిలుపునిచ్చారు.

BJP Nirudyoga Deeksha (Photo-Video Grab)

Hyd, Dec 27: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు.బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ దీక్షలో ఈటల మాట్లాడుతూ కేసీఆర్‌ను గద్దె దించటానికి విద్యార్థులు, యువత, నిరుద్యోగులు కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఒక్కసారి కుప్పకూలితే టీఆర్ఎస్ పార్టీ (TRS Party) మరొకసారి అధికారంలోకి వచ్చే ఆసార్కం లేదని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ను పిరికిపందతో ఈటల (BJP MLA Etela Rajender) పోల్చారు.

బియ్యం కొనమని చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదన్నారు. నిరుద్యోగుల కలలను కేసీఆర్ (CM KCR) ప్రభుత్వం కల్లలుగా మిగిల్చిందన్నారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా కాకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. గతంలో మాదిరి కేసీఆర్ కోసం త్యాగాలు చేసేవారు తెలంగాణ గడ్డ మీద లేరని తెలిపారు. ప్రగతి భవన్ ఇనుప కంచెలు తొలగించకుంటే భవిష్యత్తులో కేసీఆర్‌ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని హెచ్చరించారు.

తెలంగాణ గడ్డపై ఎగిరబోయేది కషాయజెండా మాత్రమేనని ఈటల స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఫీల్డ్ అసిస్టెంట్ల నోట్లో మట్టికొట్టిన దుర్మార్గపు పార్టీ టీఆర్ఎస్ అంటూ ధ్వజమెత్తారు. ఏడాదిలో‌ 145రోజులు ఫాంహౌస్‌లో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులు మగ్గిపోతున్నారని, సమస్యల పరిష్కారానికి అన్ని వర్గాల ప్రజలకు బీజేపీ అండగా ఉంటోందని ఈటల రాజేందర్ చెప్పారు.

తెలంగాణ PCC చీఫ్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు, కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు...

బీజేపీ నేత బండి సంజయ్‌

మానవత్వం లేని సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని బీజేపీ నేత బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ జనవరిలోపు నోటిఫికేషన్లు ఇవ్వకుంటే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని ప్రకటించారు. దొంగ దీక్షలు ఎలా చేయాలో.. మంత్రి కేటీఆర్ తన తండ్రిని అడిగి తెలుసుకోవాలన్నారు. 2009 కేసీఆర్ దీక్షపై ఖమ్మం డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్‌ను బయటపెడతామని హెచ్చరించారు. దీక్ష సమయంలో బాత్రూంలో ఇడ్లీలు తిన్న చరిత్ర కేసీఆర్‌దని ఆరోపించారు. దీక్ష పేరుతో ఢిల్లీ వెళ్లి కేసీఆర్‌ తాగిపడుకున్నాడని ఎద్దేవాచేశారు. ఉప ఎన్నికలప్పుడు మాత్రమే కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామంటాడని దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం దుర్మార్గమని బండి సంజయ్‌ మండిపడ్డారు.

కేసీఆర్ మోసగాడన్న విషయాన్ని మేధావివర్గం తెలుసుకోలేకపోయిందన్నారు. జనవరి లోపు నోటిఫికేషన్లు ఇవ్వకుంటే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. మానవత్వం లేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మండిపడ్డారు.బీజేపీపై నమ్మకం ఉంచి ..తెలంగాణ ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. బెంగాల్ స్ఫూర్తితో తెలంగాణలో వందసీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఎక్కడున్నారు?అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యోగుల కుంటుబాల్లో విషాధ వాతావరణం నెలకొందన్నారు. సీఎం సుపుత్రిడి వల్ల 27మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్‌కు బీజేపీ భయపట్టుకుందన్నారు. కుటుంబాలకు భారంగా మారుతున్నామని నిరుద్యోగులు బాధలో ఉన్నారన్నారు. ఉప ఎన్నికలప్పుడు మాత్రమే కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తానని చెపుతారన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించటం దుర్మార్గమన్నారు. ఉద్యోగాల కోసం స్వరాష్ట్రంలో దీక్షలు చేయాల్సిన అవసరం వస్తోందని ఊహించలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్

2023లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టేది బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయేనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు సిగ్గుంటే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏ ముఖం పెట్టుకుని జీతాలు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టూర్ల పేరుతో మంత్రి కేటీఆర్ లక్షల రూపాయలు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ మీద ప్రేమ కంటే.. కేసీఆర్‌కు తన బిడ్డల మీదనే ప్రేమ ఎక్కువనని అన్నారు. పోలీసు అధికారులు సైతం కేసీఆర్‌ను నానా బూతులు తిట్టుకుంటున్నారని మండిపడ్డారు. కొందరు పోలీసు అధికారులు మాత్రమే కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఎంపీ అర్వింద్ దుయ్యబట్టారు.



సంబంధిత వార్తలు

KTR Slams CM Revanth Reddy: పర్రె మేడిగడ్డకు పడలే.. రేవంత్ పుర్రెకు పడ్డది..చిల్లర రాతలు రాయించేవారిని వదిలిపెట్టం, దేశంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు వస్తుందన్న కేటీఆర్

Madhavi Latha Vs JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రాస్టిట్యూట్ వ్యాఖ్యలపై స్పందించిన మాదవీలత, తాడిపత్రి వాళ్లు పతివ్రతలు అయితే అంటూ సంచలన వీడియో విడుదల..

JC Prabhakar Reddy On BJP Leaders: థర్డ్ జెండర్ కంటే తక్కువ నా కొడకల్లరా..మీ కంటే జగనే మంచోడు, ఏపీ బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపాటు, చేతగాని కొడుకుల్లాగా బస్సులు తగలబెట్టారని ఫైర్

KCR: 2025లో ప్రజలందరికీ మంచి జరగాలి..నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణ భవన్‌లో క్యాలెండర్ ఆవిష్కరించనున్న కేటీఆర్