హైదరాబాద్, డిసెంబర్ 27: తెలంగాణ PCC చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ఇంటి నుంచి కార్యకర్తలు,నేతలతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పటికే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా మోహరించిన పోలీసులు... వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో పోలీసుల తీరుపై మండి పడ్డారు రేవంత్ రెడ్డి. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
భారీ పోలీసుల బందోబస్తుతో రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జూబ్లీ హిల్స్ లో ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారు.