Twin Towers Near Secretariat: సచివాలయ సమీపంలో ట్విన్‌ టవర్స్‌.. అమరవీరుల స్థూపం ముందున్న స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం.. సీఎం కేసీఆర్‌ నిర్ణయం

రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులకు (హెచ్‌వోడీ) తరచూ సచివాలయంలో పని ఉంటున్న నేపథ్యంలో వారి కార్యాలయాలన్నీ కూడా దానికి సమీపంలో ఒకేచోట నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు.

KCR (Credits: T News)

Hyderabad, May 30: నూతన సచివాలయం (New Secretariat) నిర్మాణం పూర్తయిన ఈ సమయంలో తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (KCR) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులకు (హెచ్‌వోడీ-HOD) తరచూ సచివాలయంలో పని ఉంటున్న నేపథ్యంలో వారి కార్యాలయాలన్నీ కూడా దానికి సమీపంలో ఒకేచోట నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు. నూతన సచివాలయం పూర్తిస్థాయిలో పనిచేస్తున్న నేపథ్యంలో ఆయా హెచ్‌వోడీల కార్యాలయాలను ఒకేచోటకు చేర్చడంపై సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో చర్చించారు. అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వశాఖల్లోని హెచ్‌వోడీలు, వారి ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య, తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి సమీపంలో విశాలమైన ప్రభుత్వం స్థలాలు ఎకడెకడున్నాయో ఆరా తీశారు. స్థల నిర్ధారణ తర్వాత అవసరం మేరకు, హెచ్‌వోడీల కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా ట్విన్‌ టవర్ల (Twin Towers) నిర్మాణం చేపట్టనున్నట్టు సీఎం తెలిపారు. సమీకృత సచివాలయం తరహాలోనే సమీకృత హెచ్‌వోడీల కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు.

Viral Video: బుగ్గ నిమురుతూ ఓదార్చిన మహిళా కానిస్టేబుల్‌కు నడిరోడ్డుపైనే ముద్దిచ్చాడు.. ఆమె రియాక్షన్ ఏంటంటే? వీడియో ఇదిగో..

స్మారకం ముందు తెలంగాణ తల్లి

అమరుల స్మారకానికి ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు. విగ్రహానికి రెండువైపులా అత్యద్భుతమైన ఫౌంటెయిన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

Dhoni Gets Emotional Video: ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జయభేరి.. ధోనీ భావోద్వేగం.. వీడియో వైరల్



సంబంధిత వార్తలు

CM Chandrababu Polavaram Visit Updates: పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు, 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి

CM Revanth Reddy: 98 శాతం కులగణన పూర్తి, తెలంగాణకు బహుజనుల తల్లి కావాలి...దొడ్డి కొమురయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: గురుకులాల్లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, పేదవారిపై నిర్లక్ష్యం తగదు...ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత కరెంట్ ఇస్తామని ప్రకటన