Singareni Bonus: 16న సింగరేణి దసరా బోనస్‌.. ఒక్కో కార్మికుడికి 1.53 లక్షలు.. బోనస్ లెక్కింపు ఇలా..

సింగరేణి కార్మికులకు దసరా కానుకగా లాభాల వాటా బోనస్‌ కింద రూ.711.18 కోట్లను ఈ నెల 16న చెల్లించనున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ వెల్లడించారు. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1.53 లక్షల వరకు లాభాల బోనస్‌ అందుతుందని చెప్పారు.

Singareni Employees (Credits: X)

Hyderabad, Oct 6: సింగరేణి కార్మికులకు (Singareni) దసరా (Dasara) కానుకగా లాభాల వాటా బోనస్‌ కింద రూ.711.18 కోట్లను ఈ నెల 16న చెల్లించనున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) ఇటీవల ప్రకటించిన విధంగా సింగరేణి సంస్థ నిరుడు సాధించిన రూ.2,222.46 కోట్ల లాభంలో 32 శాతాన్ని దసరా పండుగకు వారం రోజుల ముందే చెల్లిస్తున్నట్టు తెలిపారు. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1.53 లక్షల వరకు లాభాల బోనస్‌ అందుతుందని చెప్పారు. సింగరేణి సంస్థను లాభాల దిశగా నడిపిస్తున్న కార్మికులకు గతంలో కన్నా ఎక్కువ శాతాన్ని లాభాల వాటాగా ప్రకటించిన సీఎం కేసీఆర్‌ కు సింగరేణి ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. గత ఆర్థిక సంవత్సరంలో విధులు నిర్వర్తించిన 46,326 మంది సింగరేణి ఉద్యోగులకు వారు పనిచేస్తున్న గని, శాఖ ఆధారంగా బోనస్‌ చెల్లిస్తారు. ఎక్కువ హాజరు ఉన్నవారికి ఎక్కువ మొత్తంలో బోనస్‌ లభిస్తుంది.

Mumbai Fire Accident: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం.. 40 మందికి గాయాలు

కార్మికులు పనిచేసిన పనిదినాల ఆధారంగా బోనస్‌ లెక్కింపు ఇలా..

  • భూగర్భ గని ఉద్యోగులకు రోజుకు రూ.749.58
  • ఓపెన్‌ కాస్ట్‌ గనులు, ఇతర సర్ఫేస్‌ శాఖలు రూ.627.41
  • ఇతర విభాగాలు, శాఖల్లో పనిచేసేవారికి రూ.578.69

Allu Arjun: అల్లు అర్జున్‌ కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌ లో మైనపు విగ్రహం.. బన్నీ నుంచి కొలతలు తీసుకుంటున్న వీడియోను షేర్ చేసిన టుస్సాడ్స్ 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Share Now
Advertisement