IPL Auction 2025 Live

Lockdown in TS: లాక్‌డౌన్‌పై సీరియస్ అయిన తెలంగాణ హైకోర్టు, రేపటి నుంచి లాక్‌డౌన్‌ అంటే ప్రజల పరిస్థితి ఏంటీ? అంబులెన్స్‌లను సరిహద్దుల్లో ఎందుకు ఆపుతున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధర్మాసనం

కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు తగ్గిండంపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు బేఖాతరు చేస్తే కోర్టు ధిక్కారణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపివేయవద్దని తెలంగాణకు సర్కార్‌‌ను (Telangana government) హైకోర్టు ఆదేశించింది. సరిహద్దుల్లో అంబులెన్స్‌ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా? అని సూటిగా ప్రశ్నించింది.

High Court of Telangana | (Photo-ANI)

Hyderabad, May 11: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు తగ్గిండంపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు బేఖాతరు చేస్తే కోర్టు ధిక్కారణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపివేయవద్దని తెలంగాణకు సర్కార్‌‌ను (Telangana government) హైకోర్టు ఆదేశించింది. సరిహద్దుల్లో అంబులెన్స్‌ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా? అని సూటిగా ప్రశ్నించింది.

అయితే లిఖిత పూర్వకంగా ఎలాంటి ఆదేశాలూ లేవని ఏజీ హైకోర్టుకు ( High Court) నివేదించారు. అయితే మౌఖిక ఆదేశాలేమైనా ఉన్నాయా? అని మరో ప్రశ్న వేసింది. ఈ విషయాన్ని సీఎస్‌ను అడిగి చెబుతామని ఏజీ పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీకి కూడా ఎంతో మంది పేషెంట్లు ఎన్నో రాష్ట్రాల నుంచి వస్తుంటారని, అలా అని ఢిల్లీలో అంబులెన్స్‌లను ఆపేస్తున్నారా? అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఆపడమేంటని అసహనం వ్యక్తం చేసింది.

ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఆర్ఎంపీ డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌తో ఇక్కడికి వస్తున్నారని.. హైదరాబాద్ అనేది మెడికల్ హబ్ అని, ఆరోగ్యం కోసం ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజలను ఇక్కడికి రావొద్దని చెప్పడానికి ఏ అధికారం ఉందని ప్రశ్నించింది. ‘హాస్పిటల్‌లో వైద్యం కోసం వచ్చే వారిని మీరెలా అడ్డుకుoటారు? కేర్, అపోలో ఆస్పత్రిలో అంతర్జాతీయ పేషంట్లు ఉంటారు. వాళ్ళను కూడా అడ్డుకుంటారా? అని ప్రశ్నించింది.

తెలంగాణలో 10 రోజుల పాటు లాక్‌డౌన్, బుధవారం ఉదయం 10 గంటల నుంచి అమల్లోకి, టీకా కొనుగోళ్ల కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయం

అదే విధంగా.. ‘‘మేం ఆదేశాలు ఇచ్చిన రోజు ప్రెస్‌మీట్‌ పెట్టి... లాక్‌డౌన్‌ అవసరం లేదని సీఎస్‌ ఎలా చెప్తారు. రంజాన్‌ పండుగ అయ్యాక లాక్‌డౌన్‌ పెట్టాలనుకుంటున్నారా?’’ అంటూ మండిపడింది. ఇక ఇందుకు స్పందించిన అడ్వకేట్‌ జనరల్‌.. మధ్యాహ్నం కేబినెట్‌ భేటీ ఉందని, సమావేశం అనంతరం లాక్‌డౌన్‌, కర్ఫ్యూపై వివరాలు సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితులపై పూర్తి వివరాలు ఇవ్వాలన్న న్యాయస్థానం విచారణను మధ్యాహ్నం 2:30కు వాయిదా వేసింది.

అనంతరం లాక్‌డౌన్ (Telangana Lockdown) ప్రకటన తర్వాత ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ ఉదయం 10 గంటల వరకు కనీసం వీకెండ్ లాక్ డౌన్ కూడా పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక్కసారిగా రేపటి నుండి లాక్ డౌన్ అంటే ఇతర రాష్ట్రాల ప్రజలు ఇంత తక్కువ టైమ్‌లో ఎలా వారి ప్రాంతాలకు వెళతారని (Migrant Workers) ప్రశ్నించింది. గతేడాది వలస కార్మికులు ఇబ్బందులు పడినట్లు ఈ సారి ఇబ్బంది పడకుండా చూడాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రోజువారీ కూలి చేస్తూ బతికే వాళ్ళు వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించగా.. 50 శాతం వలస కార్మికులు వాళ్ళ వాళ్ళ సొంతూళ్లకు వెళ్లారని తెలిపారు.

టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం, పార్శిల్‌, కార్గొ స‌ర్వీసుల‌ సేవ‌ల‌ను తాత్కాలికంగా ర‌ద్దు చేస్తున్నట్లు ప్రకటన, ప‌రిస్థితులు కుదుట‌ప‌డిన తరువాతే సేవల పునురుద్ధరణకు అవకాశం

లాక్ డౌన్ వల్ల సాయంత్రపు వేళల్లో ఏమైనా సడలింపులు ఉన్నాయని అడగగా, ఎలాంటి రిలాక్షేషన్స్ లేవని అడ్వకేట్ జనరల్ తెలిపారు. లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌పై పూర్తి వివరాలు తెలపడానికి హైకోర్టును అడ్వకేట్ జనరల్ మూడు రోజుల సమయం కోరారు. అప్పటి వరకు జనాలు ప్రాణాలు కోల్పోవాలా అని సీరియస్ అయ్యింది. మందుల రేట్లు, ప్రైవేట్ హాస్పిటల్ అధిక బిల్లులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఈ సమయంలో హాస్పిటల్‌పై చర్యలు తీసుకోవాలని తామెలా ఆదేశాలిస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రపంచమంతా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే హాస్పిటళ్లై చర్యలు తీసుకోమని తామెలా చెప్తామని అన్నాది. ఆర్టికల్ 14,19 1(డీ) ప్రకారం అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్సులను నిలిపి వేసి ఉల్లంఘనకు ప్రభుత్వం పాల్పడిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

బుధవారం నుంచి 10 రోజులు పాటు లాక్ డౌన్ విధిస్తున్నామని కోర్టుకు ఏజీ తెలిపారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం ఇస్తున్నామని చెప్పారు. అనంతరం అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు ఏజీ తెలిపారు.

రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటన నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు హైకోర్టు కీలక సూచనలు చేసింది. లాక్‌డౌన్ కారణంగా వెసులుబాటు కల్పించే సమయం మొత్తాన్ని వీడియో గ్రఫీ చేయాలని మూడు కమిషనర్లేటకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అన్నది ఆయా పీఎస్ పరిధిలో వీడియో గ్రఫీ చేయాలని ఆదేశించింది. కోవిడ్ నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.



సంబంధిత వార్తలు

KCR: దటీజ్ కేసీఆర్, కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు బ్రేక్...గులాబీ బాస్ వ్యూహంతో వెనక్కి తగ్గిన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో టచ్‌లోకి పార్టీ మారిన ఎమ్మెల్యేలు!

Praja Vijayotsava Sabha: కేసీఆర్‌..ఒక్కసారి అసెంబ్లీకి రా, అన్నీ లెక్కలు తేలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు, బీఆర్‌ఆఎస్ నేతలకు మైండ్‌ దొబ్బిందని విమర్శ

Ram Gopal Varma: ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వర్మ, నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో వెల్లడి

Telangana HC Cancels GO No 16: కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు, ఇక నుంచి భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం చేయాలని ఆదేశాలు