Telangana: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, అసెంబ్లీలో రేపు 10 గంటలకు ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన
ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేయనున్నారు. నిరుద్యోగులందరూ ( unemployed youth in Telangana) బుధవారం ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
Hyd, Mar 8: అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ (CM KCR) శుభవార్త చెప్పనున్నారు. ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేయనున్నారు. నిరుద్యోగులందరూ ( unemployed youth in Telangana) బుధవారం ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన (Major announcement) చేశారు. అసెంబ్లీ వేదికగా తాను నిరుద్యోగులకు శుభవార్త చెబుతానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 70 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఖాళీల వివరాలను సీఎం కేసీఆర్‌కు చీఫ్ సెక్రటరీ అందజేశారు. మరో 30 వేల ఖాళీలను కూడా భర్తీ చేయునున్నట్లు అసెంబ్లీలో కేసీఆర్ చెప్పనున్నారు. ఇక ఖాళీల భర్తీ కోసం 4 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. దీంతో నిరుద్యోగుల్లో ఆసక్తి పెరిగింది. కేసీఆర్ ప్రకటన ఎలా ఉండబోతోందని ఆతృతగా ఎదురు చూస్తున్నారు రేపు సమావేశాల్లో గత ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయో గణాంకాలతో సహా కేసీఆర్ వివరించనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్న అసంతృప్తి ఉంది.
నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడంలేదనే అపవాది ఉంది. ప్రభుత్వ శాఖలో దాదాపు 90 వేల ఖాళీలు ఉన్నాయని.. వాటిని భర్తీ చేయడంలేదని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దీనికి సమాధానంగా భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖలలో కలిపి 70 వేల పైగా ఖాళీలు ఉన్నాయి. పోలీస్, హెల్త్ శాఖలు, మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్అండ్‌బీ శాఖలలో ఉద్యోగాలు ఉన్నాయి.