Rayalaseema Lift Irrigation Scheme: ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఎలా ఆదేశించగలదు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జోక్యం చేసుకోలేము, పిటిషనర్లకు స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు

సుప్రీంకోర్టు, జాతీయ హరిత న్యాయస్థానం‌(ఎన్జీటీ)లో పెండింగ్‌లో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం (Rayalaseema Lift Irrigation Scheme) పిటిషన్‌పై‌ తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేత వంశీచందర్‌రెడ్డి, సామాజిక కార్యకర్త శ్రీనివాస్ (Congress leader Vamsichand Reddy, social activist Srinivas) దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.

High Court of Telangana | (Photo-ANI)

Hyderabad, Sep 1: రాయలసీమ ఎత్తిపోతల పథకం పిటిషన్‌పై‌ తెలంగాణ హైకోర్టు (Telangana HC) కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు, జాతీయ హరిత న్యాయస్థానం‌(ఎన్జీటీ)లో పెండింగ్‌లో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం (Rayalaseema Lift Irrigation Scheme) పిటిషన్‌పై‌ తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేత వంశీచందర్‌రెడ్డి, సామాజిక కార్యకర్త శ్రీనివాస్ (Congress leader Vamsichand Reddy, social activist Srinivas) దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టుకు విచారణ పరిధి ఉంటుందని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు విచారణ సందర్భంగా తెలిపారు. అయితే సుప్రీంకోర్టులో (Supreme Court) నదీ జలాల కేటాయింపు అంశం ఉందని ఏజీ తెలియజేశారు.

అనుమతులు లేకుండా ఏపీ ప్రాజెక్టు పనులు చేపడుతోందని ఆయన హైకోర్టుకు విన్నివించుకున్నారు. ఈ వాదనలు విన్నకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఎలా ఆదేశించగలదని ప్రశ్నించింది. డీపీఆర్ సమర్పించి, టెండర్లకు వెళ్లేందుకు ఏపీకి ఎన్జీటీ అనుమతిచిందని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎన్జీటీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లలేదని హైకోర్టు ప్రశ్నించిందిజ ఎన్జీటీకి విచారణ పరిధి లేదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. విచారణ పరిధిపై ముందు ఎన్జీటీ తేల్చాలని హైకోర్టు పేర్కొంది.  రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్‌కు ఏపీ ప్రభుత్వం పిలుపు

పిటిషన్‌లోని అన్ని అంశాలు సుప్రీంకోర్టు ముందు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ ఏజీ శ్రీరాం తెలిపారు. సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఆగాలని ఏపీ ఏజీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు నిరవధిక వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టులో తేలిన తర్వాత తమ దృష్టికి తీసుకురావచ్చునని పిటిషనర్లకు తెలంగాణ హైకోర్టు సూచించింది.

ఏపీ ప్ర‌భుత్వం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ‌న రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం నిర్మించ త‌ల‌పెట్టిన విష‌యం తెలిసిందే. కాగా పర్యావరణ అనుమతి లేకుండా చేపట్టిన ఈ ఎత్తిపోతల పనులను నిలుపుదల చేయాలంటూ తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మే 20న విచార‌ణ చేప‌ట్టిన ఎన్జీటీ ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప‌నుల‌ను నిలుపుద‌ల చేయాల‌ని స్టే ఇచ్చింది. నీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ వాదనలో అర్థం లేదు: KCR

అయితే త‌న వాటా జ‌లాల‌ను వినియోగించుకునేందుకు ఈ ప‌థ‌కం చేప‌ట్టామ‌ని ఏపీ ప్ర‌భుత్వం ఎన్జీటీలో (National Green Tribunal (NGT) రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీని వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణంపై ఎలాంటి ప్ర‌తికూల ప్ర‌భావం ఉండ‌ద‌ని నివేదించింది. దీనిపై జూలై13న విచారించిన ఎన్జీటీ ఎత్తిపోత‌ల ప‌నుల టెండ‌ర్ ప్ర‌క్రియ చేప‌ట్టేందుకు అనుమ‌తిచ్చిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు పర్యావరణ అనుమతి అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ స్పష్టం చేసింది. మా నీళ్లను మేము తీసుకుంటున్నాం, దీనిపై రాజకీయాలు చేయడం తగదు : వైయస్ జగన్ 

ఈ ఎత్తిపోతల పనులు పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపవని తేల్చిచెబుతూ జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్జీటీ) దక్షిణ ప్రాంత బెంచ్‌ (చెన్నై)కు బుధవారం నివేదిక ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వాదనతో పూర్తి స్థాయిలో ఏకీభవిస్తూ కేంద్రం నివేదిక ఇవ్వడం గమనార్హం.