Amaravati, July 27: రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్‌కు (Rayalaseema Lift Irrigation Project Tenders) ఏపీ ప్రభుత్వం పిలుపు నిచ్చింది. ఈ రోజు(సోమవారం) నుంచి టెండర్లు స్వీకరించేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారి చేసింది. జ్యూడిషియల్ పర్వ్యూ అనుమతితో టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈపీసీ విధానంలో 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా టెండర్లను ఆహ్వానించినట్లు అధికారులకు వెల్లడించారు. కరోనా టెస్టులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ర్యాపిడ్ ఆంటీజన్ టెస్టుకి రూ.750 మించి వసూలు చేస్తే కఠిన చర్యలు, ఐసీఎంఆర్ అనుమతించిన ల్యాబ్‌లలో కోవిడ్ టెస్టులు
కాగా ఈ నెల13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అప్లీకేషన్‌లు స్వీకరించనున్నట్లు చెప్పారు.13న టెక్నికల్ బిడ్ తెరిచి, 17న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించి 19న టెండర్‌ను ఖరారు చేయనున్నట్లు అధికారులు వెల్లడించింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటి మట్టం వద్ద రోజుకి 34,722 క్యూసెక్కుల నీరు ఎత్తిపోయడమే లక్ష్యంగా పథకాన్ని నిర్థేషించినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే తాము నియమించిన కమిటీ నివేదిక వచ్చే వరకూ రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు (Rayalaseema Lift Irrigation Project) చేపట్టొద్దని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై జోనల్ బెంచ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖ, జల్‌శక్తి, కేంద్ర జలసంఘం, కృష్ణానది యాజమాన్య బోర్డుల అనుమతులు లేకుండానే ఈ ఎత్తిపోతల నిర్మిస్తున్నారంటూ తెలంగాణలోని నారాయణపేట జిల్లా బాపన్‌పల్లికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీని ఆశ్రయించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొద్ది మొత్తంలో నీళ్లు తీసుకుంటున్నామంటూ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దెబ్బతీసేలా జల దోపిడీ చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌ను జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది.
పిటిషన్‌లోని అంశాలను పరిశీలించేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ (ఎంఈఎఫ్)లోని పర్యావరణ మదింపు కమిటీ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (బెంగళూరు జోనల్ కార్యాలయం), ఐఐటీ హైదరాబాద్, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులోని ఒక సీనియర్ అధికారితో కమిటీని ఏర్పాటుచేసింది. పర్యావరణ మదింపు కమిటీ, సీపీసీబీ, ఐఐటీల నుంచి ఎంతమంది సభ్యులు అవసరం అవుతారో ఎంఈఎఫ్ గుర్తించాలని ధర్మాసనం సూచించింది.
పథకానికి పర్యావరణ శాఖ అనుమతులు అవసరమా..? పథకం నిర్మాణానికి అవసరమైన అనుమతులన్నీ తీసుకున్నారా..? రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకానికి ముడిపడిన అంశమైతే అందుకు తగిన అనుమతులు పొందారా..? నీటి తరలింపుతో పర్యావరణానికి విఘాతం కలగకుండా తీసుకున్న చర్యలు సరిపోతాయా..? ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నుంచి రెండు రాష్ట్రాల నీటి ప్రయోజనాలకు రక్షణ ఉంటుందా? అనే అంశాలను ఈ కమిటీ పరిశీలించి రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది.