Coronavirus Vaccine (Photo Credits: ANI)

Amaravati, July 27: ఏపీలో కోవిడ్-19 విజృంభిస్తోంది. ఈ క్రమంలో ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో కరోనా వైద్య పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ర్యాపిడ్‌ ఆంటీజన్ టెస్టులకు (Rapid Antigen Test in AP) ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఐసీఎంఆర్‌ (ICMR) అనుమతించిన ల్యాబ్‌లలో కోవిడ్ టెస్టులు జరపాలని, ర్యాపిడ్‌ ఆంటీజన్‌ టెస్టుకి రూ.750 మించి వసూలు చేయొద్దని ప్రభుత్వం (AP Govt) ఆదేశించింది. ఆ నమూనాని విఆర్‌డిఎల్ పరీక్షకు పంపితే రూ.2800 మించి వసూలు చేయొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 7,627 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 90 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, వెయ్యి దాటిన కరోనా మరణాలు

కరోనా పరీక్షలు చేసే ల్యాబ్ సిబ్బంది ఐసీఎంఆర్‌ లాగిన్‌లో డేటాను తప్పకుండా నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేట్‌ ఎన్‌ఏబీహెచ్‌ ఆస్పత్రులు, ఎన్ఏబిఎల్‌ ల్యాబ్‌లు పరీక్షల నిర్వహణకు ముందు నోడల్ అధికారి అనుమతి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విశాఖలో చిన్న పిల్లల అక్రమ రవాణా గుట్టు రట్టు, కీలక సూత్రధారి పచ్చిపాల నమ్రతతో పాటు మరో ఆరుగురు ఆరెస్ట్, కేసు వివరాలను వెల్లడించిన సీపీ ఆర్కే మీనా

ఇదిలా ఉంటే కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ మరో రికార్డు (AP Coronavirus) నెలకొల్పింది. తొలిసారిగా ప్రతి పది లక్షల జనాభాకి సగటున 30,774 మందికి పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. దేశ సగటు 11,746గానే ఉంది. గడిచిన 24 గంటల్లో 47,645 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా మొత్తం పరీక్షల సంఖ్య 16,43,319కి చేరింది. కొత్తగా 7,627 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 96,298కి చేరింది. ఇదే సమయంలో 3,046 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ కావడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 46,301కి చేరింది. తాజాగా 56 మంది మృతితో మొత్తం మరణాలు 1,041కి చేరాయి. యాక్టివ్‌ కేసలు 48,956 ఉన్నాయి.