CM Dalit Empowerment Scheme: సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్‌..రాబోయే నాలుగేండ్లలో 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు, అవసరమైతే మరో రూ. 500 కోట్లు పెంచడానికి ప్రభుత్వం సిద్ధం, సీఎం దళిత సాధికారత పథకంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్

ఎస్సీ సాధికారతపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో అఖిలపక్ష సమావేశం (all party meeting) జరిగింది. ఎస్సీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న సీఎం దళిత సాధికారత పథకం (Dalit Empowerment Scheme) విధివిధానాలపై ఈ భేటీలో చర్చించారు.

Telangana CM KCR (Photo-Twitter)

Hyderabad, June 27: ఎస్సీ సాధికారతపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో అఖిలపక్ష సమావేశం (all party meeting) జరిగింది. ఎస్సీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న సీఎం దళిత సాధికారత పథకం (Dalit Empowerment Scheme) విధివిధానాలపై ఈ భేటీలో చర్చించారు.

ఈ సమావేశానికి కాంగ్రెస్‌ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నుంచి చాడ వెంకట్‌రెడ్డి, మజ్లిస్‌ తరఫున బలాలా, పాషా ఖాద్రి హాజరయ్యారు. కాగా అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే బీజేపీ ఆదేశాలు పట్టించుకోకుండా మోత్కుపల్లి నర్సింహులు పాల్గొన్నారు. బీజేపీ ఆఫీస్‌లో దళిత నేతల భేటీకి డుమ్మా కొట్టిన మోత్కుపల్లి వ్యవహారంపై బీజేపీ సీరియస్‌గా ఉంది.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో ప్రభుత్వాలదే కీలకపాత్రని చెప్పారు. ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీల బాధలు పోవాలని.. వారి అభివృద్ధి కోసం దశలవారీ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఎస్సీల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఏం చేయాలో సూచించాలని అఖిలపక్ష నేతలను సీఎం కోరారు. భూమి ఉత్పత్తి సాధనంగా ఇన్నాళ్లూ జీవనోపాధి సాగింది.

ఎస్సీ యువత స్వయం ఉపాధి పొందేలా చూడాలి. పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో స్వయం ఉపాధి పొందాలి. గ్రామీణ, పట్టణ ఎస్సీల సమస్యలు గుర్తించి పరిష్కారం చూపాలి. దళిత సాధికారత పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తాం. భగవంతుడిచ్చిన‌ సర్వ శక్తులన్నీ ఉపయోగించి సీఎం దళిత ఎంప‌వ‌ర్‌మెంట్ పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలనేదే త‌న‌ దృఢ సంకల్పం అని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు అన్నారు.

మరియమ్మ లాకప్ డెత్ మిస్టరీ, ఆమె కుమారుడిని పరామర్శించిన తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, అడ్డగూడురులో ఏం జరిగిందనే వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు

ద‌ళితుల అభివృద్ధికి (Dalit Empowerment) రాబోయే మూడు, నాలుగేండ్లలో 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. దళిత సాధికారతను సాధించడానికి ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేయడానికి నిశ్చయించుకున్నట్లు తెలిపారు. దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరగాల‌న్నారు. అట్టడుగున ఉన్న వారినుంచి సహాయం ప్రారంభించాల‌న్నారు. వారి అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా నిత్యం పర్యవేక్షించాల‌న్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంద‌న్నారు. ఈ బడ్జెట్ లో సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ పథకానికి రూ. 1000 కోట్లు కేటాయించాలనుకున్న‌ట్లు వివ‌రించారు. అవ‌స‌ర‌మైతే మరో రూ. 500 కోట్లు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. ఈ బడ్జెట్, ఎస్సీ సబ్ ప్లాన్‌కు అద‌నం అని తెలిపారు.

మరియమ్మ లాకప్‌డెత్‌ ఘటనపై తక్షణమే విచారణ జరపాలని డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు, మరియమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి

అర్హులకు నేరుగా ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటాం. పారదర్శకంగా దళారీలు లేని విధానానికి సలహాలు ఇవ్వాలి. ఈ పథకానికి ఎస్సీల్లో అర్హులైన కుటుంబాల గణన జరపాలి. ఎస్సీ సాధికారత సాధనకు ప్రణాళికాబద్ధంగా పని చేస్తాం. అఖిలపక్ష నేతలంగా కలిసి రావాలి. ఎస్సీ సాధికారత పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలి’’ అని సీఎం తెలిపారు. దళితుల అభ్యున్నతి కోసం అఖిలపక్షం సూచనలు ఇవ్వాలి.దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని విధానం.రాజకీయాలకతీతంగా సమిష్టి కార్యాచరణ బాధ్యత తీసుకుందాం. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను గుర్తించి పరిష్కారాలు వెతకాలి. దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని విధానం రైతుబంధు పథకం, ఆసర పెన్షన్ల మాదిరిగా.. నేరుగా దళితులకు ఆర్థికసాయం అందేలా సూచనలు ఇవ్వాలి'' అని కేసీఆర్‌ తెలిపారు.

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్లినా సామాజికంగా, ఆర్థికంగా పీడిత వార్గాలు ఎవరంటే చెప్పే పేరు దళితులు, అందుకే ఈ బాధలు పోవాలన్నారు. తాము కూడా పురోగమించగలం అనే ఆత్మ స్థైర్యంతో దళిత సమాజం ముందుకు పోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాలో తగిన సూచనలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ అఖిలపక్ష నాయకులను కోరారు.

గోరేటి వెంకన్నగల్లీ చిన్నది, గ‌రిబోళ్ల క‌థ పెద్ద‌ది.. పాటను మనసు పెట్టి వింటే దళితుల సమస్యల‌కు పరిష్కారాలు దొరుకుతాయ‌న్నారు. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను విడివిడిగా గుర్తించి పరిష్కారాలు వెతకాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. దళితుల అభ్యున్నతికి సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ పథకాన్ని ప్ర‌భుత్వం పటిష్టంగా అమలు చేయాలనుకుంటున్న‌ట్లు తెలిపారు. రైతుబంధు పథకం, ఆసరా పెన్షన్ల మాదిరి నేరుగా ఆర్ధిక సాయం అందే విధంగా అత్యంత పారదర్శకంగా, మధ్య దళారీలు లేని విధానం కోసం సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా అఖిల‌ప‌క్ష నేత‌ల‌ను సీఎం కోరారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Special Package For Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు గుడ్‌న్యూస్‌, ఏకంగా రూ. 11,500 కోట్ల స్పెషల్ ప్యాకేజీ ఇచ్చేందుకు కసరత్తు, కేంద్ర కేబినెట్‌ భేటీలో చర్చ

CM Revanth Reddy: ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

Chandrababu on Telangana: వీడియో ఇదిగో, నా విజన్ వల్లే తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది, సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Rupee Falls To All-Time Low: డాలర్ ముందు విలవిలలాడుతున్న రూపాయి, మళ్లీ మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిన భారత కరెన్సీ, దేశ ఆర్థిక వ్యవస్థకూ దెబ్బ తప్పదంటున్న విశ్లేషకులు

Share Now