Telangana Floods: భారీ వరదలు, ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ పరిస్థితిని పర్యవేక్షించిన సీఎం కేసీఆర్, ఇంకా మూడు రోజుల పాటు వర్షాలు

రికార్డుల వాన హోరెత్తుతున్నది. వరద పోటెత్తుతున్నది. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ సహా పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది.

KCR (Credits: T News)

తెలంగాణలో గత 4 రోజులుగా రాష్ట్రమంతా ఊహించనంత వర్షం పడుతున్నది. రికార్డుల వాన హోరెత్తుతున్నది. వరద పోటెత్తుతున్నది. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ సహా పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది.తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రమాదకర సంఘటనల నుంచి ప్రజలను రక్షిస్తూ, ప్రాణనష్ట నివారణ చర్యలు చేపట్టే దిశగా మంత్రులను, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

గోదావరికి నదికి అంతకంతకూ పెరుగుతున్న వరద, అలర్ట్ అయిన అధికారులు, కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

వారికి ఎప్పటికప్పుడు ఆదేశాలిచ్చారు. మంత్రులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీర్ ప్రాణనష్టం జరగకుండా చూడాలని, అనుకోకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే వారికి మెరుగైన చికిత్స అందించేలా చూసుకోవాలని సూచించారు. ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం సూచనలతో మంత్రులు, ప్రజా ప్రతినిధులు వరద, ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. మంత్రులు పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని పలు ముంపు ప్రాంతాలలో సహాయ చర్యల్లో ప్రత్యక్ష్యంగా పాల్గొన్నారు.



సంబంధిత వార్తలు

KTR: అదానీకి అండగా బడే భాయ్ - చోటే భాయ్...కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి…ఢిల్లీలో ఒక నీతా? , రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే లగచర్లకు రావాలని కేటీఆర్ సవాల్

Gautam Adani Bribery Case: లంచం ఆరోపణలను ఖండించిన వైసీపీ, అదాని గ్రూపుతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని ప్రకటన, సెకీతోనే ఒప్పందం చేసుకున్నామని వెల్లడి

KCR: దటీజ్ కేసీఆర్, కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు బ్రేక్...గులాబీ బాస్ వ్యూహంతో వెనక్కి తగ్గిన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో టచ్‌లోకి పార్టీ మారిన ఎమ్మెల్యేలు!

KTR On Adani Issue: అదానితో కాంగ్రెస్ - బీజేపీ అనుబంధం.. దేశానికి అవమానం, తెలంగాణలో అదాని పెట్టుబడుల వెనుక కాంగ్రెస్ వాట ఎంతో బయట పెట్టాలని కేటీఆర్ డిమాండ్