Telangana: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం, ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రైవేట్‌ మందుల దుకాణాలు ఎత్తివేయాలని నిర్ణయం

ప్రభుత్వ ఆసుపత్రుల్లోని (govt. hospitals) ప్రైవేట్‌ మందుల దుకాణాలను ఎత్తివేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రభుత్వమే ఉచితంగా మందులు ఇస్తున్నప్పుడు వీటిని (private pharmacies ) ఎందుకు కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Harish Rao tested positve for Corona (photo-PTI)

Hyd, May 17: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని (govt. hospitals) ప్రైవేట్‌ మందుల దుకాణాలను ఎత్తివేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రభుత్వమే ఉచితంగా మందులు ఇస్తున్నప్పుడు వీటిని (private pharmacies ) ఎందుకు కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బోధనాసుపత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లోని ప్రైవేట్‌ ఔషధ దుకాణాలను ఎత్తివేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో వాటిని ఏర్పాటు చేసిన యాజమాన్యాల నుంచి రాజకీయ ఒత్తిడి పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఖాళీ చేయబోమని చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అవసరమైతే కోర్టులకు వెళ్లి ఖాళీ చేయించకుండా స్టే తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తామన్నట్లు సమాచారం. అయితే చట్టపరమైన చిక్కులు తలెత్తకుండా వీటిని ఎలా ఖాళీ చేయించాలన్న (shutting down private pharmacies) దానిపై వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు ప్రారంభించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్‌ మందుల దుకాణాలను ఎత్తి వేయాల్సిందేనని మంత్రి హరీశ్‌రావు.. అధికారులకు హుకుం జారీచేశారు. దీంతో తొలగింపునకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రైవేట్‌ దుకాణాలను ఎత్తివేయడమే కాకుండా.. తక్షణమే అన్ని ఆసుపత్రుల్లో ఉచితంగా అన్ని రకాల మందులు, అవసరమైనన్ని సరఫరా చేయాలని కూడా వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. రోగులు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది.

జూన్ 15 నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ సెకండ్ ఇయర్ త‌ర‌గ‌తులు, జూలై 1 నుంచి ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ క్లాసులు, అక‌డ‌మిక్ షెడ్యూల్‌ విడుదల చేసిన తెలంగాణ ఇంట‌ర్ బోర్డు

కాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మొదలు బోధనాసుపత్రుల వరకు అన్నింటికీ ప్రభుత్వమే ఉచితంగా మందులను సరఫరా చేస్తుంది. దీనికి ప్రభుత్వం మూడేళ్లుగా రూ.330 కోట్ల చొప్పున కేటాయించగా, ఈ ఏడాది రూ.500 కోట్లు కేటాయించింది. అయితే అనేక ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల్లోని ప్రాంగణాల్లో ప్రైవేట్‌ మెడికల్‌ షాపులకు కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం అనుమతి ఇచ్చిం ది. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌ వంటి బోధనాసుపత్రుల్లో అయితే రోజుకు రూ.లక్షల విలువైన మందుల విక్రయాలు జరుగుతున్నాయి.

అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రైవేట్‌ ఔషధ దుకాణాలను ఎత్తివేయాలన్న మంత్రి హరీశ్‌ ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వమే ఉచితంగా మందులు ఇస్తున్నప్పుడు ప్రైవేట్‌ మెడి కల్‌ షాపుల అవసరం ఏముంటుంది?. ఎక్కడైనా ప్రభుత్వ డాక్టర్లు ఉచి త మం దులు ఇవ్వకుండా ప్రైవేట్‌లో కొ నుక్కో మని రాసిస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్ తెలిపారు.



సంబంధిత వార్తలు

Pawan Kalyan On Telangana State: తెలంగాణ అంటే నా గుండె కొట్టుకుంటుంది...పోరాటల గడ్డ, బండెనక బండి కట్టి నాకు ఇష్టమైన పాట, పరిపాలనలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అని మండిపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Manipur CM's House Under Attack: మ‌ణిపూర్ సీఎం నివాసంపై దాడి, మ‌రోసారి ర‌ణ‌రంగంగా మారిన ఇంఫాల్, సీఎం బిరెన్ సింగ్ సుర‌క్షితం

KTR: దేవుళ్లను మోసం చేసిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్ పార్టీ..కేటీఆర్ ఫైర్, బఫర్‌ జోన్‌లో పేదల ఇండ్లు కూల్చి షాపింగ్ మాల్స్‌కు పర్మిషన్లా?

Nara Ramamurthy Naidu Passed Away: ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మృతి, మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు..హీరో నారా రోహిత్ తండ్రే రామ్మూర్తి నాయుడు