IPE Exams 2020. Representational Image. | Photo: PTI

తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ద్వితీయ సంవ‌త్స‌రం త‌ర‌గ‌తులు జూన్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు తెలంగాణ ఇంట‌ర్ బోర్డు సోమ‌వారం 2022-23 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి ఇంట‌ర్మీడియ‌ట్ అక‌డ‌మిక్ షెడ్యూల్‌ను విడుద‌ల (TS Inter Academic Calendar 2023) చేసింది. ఈ షెడ్యూల్ ప్ర‌కారం జూలై 1 నుంచి ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి.

ఈ ఏడాది ఇంట‌ర్ షెడ్యూల్ 221 ప‌ని దినాల‌తో కూడి ఉంద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో ఇంట‌ర్ బోర్డు వెల్ల‌డించింది. అక్టోబ‌ర్ 2 నుంచి 9 వ‌ర‌కు ద‌స‌రా సెల‌వులు, జ‌న‌వ‌రి 13 నుంచి 15 వ‌ర‌కు సంక్రాంతి సెల‌వులు ఇవ్వ‌నున్న‌ట్లుగా బోర్డు పేర్కింది. ఇక ప్రీ ఫైన‌ల్ ప‌రీక్ష‌ల‌ను ఫిబ్ర‌వ‌రి 6 నుంచి 13 వ‌ర‌కు నిర్వ‌హ‌స్తామ‌ని తెలిపింది. ఫిబ్ర‌వ‌రి 20 నుంచి మార్చి 6 వ‌ర‌కు ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు, మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వ‌ర‌కు వార్షిక ప‌రీక్ష‌లను నిర్వ‌హించ‌నున్నారు.