Telangana High Court: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం, కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడం లేదంటూ అసహనం, 17లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని వైద్యారోగ్య శాఖకు ఆదేశాలు

కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడం లేదంటూ ప్రభుత్వంపై (TS Govt) అసహనం వ్యక్తం చేసింది. ఆదేశాలు అమలు కాకపోతే వైద్యారోగ్య శాఖ అధికారులపై (Health ministry) కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని ఈ సంధర్భంగా హెచ్చరించింది. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ను దీనితో బాధ్యుల్ని చేస్తామని పేర్కొంది. ఆస్పత్రుల్లో మరణిస్తే మృతదేహాలకు పరీక్షలు చేయాలని గతంలో హైకోర్టు (Telangana High Court) ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు అమలు కావడం లేదని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

High Court of Telangana | (Photo-ANI)

Hyderabad, June 8: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడం లేదంటూ ప్రభుత్వంపై (TS Govt) అసహనం వ్యక్తం చేసింది. ఆదేశాలు అమలు కాకపోతే వైద్యారోగ్య శాఖ అధికారులపై (Health ministry) కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని ఈ సంధర్భంగా హెచ్చరించింది. తెలంగాణలో కరోనా పరీక్షల తీరుపై అసంతృప్తి వ్యక్తంచేసిన హైకోర్టు

వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ను దీనితో బాధ్యుల్ని చేస్తామని పేర్కొంది. ఆస్పత్రుల్లో మరణిస్తే మృతదేహాలకు పరీక్షలు చేయాలని గతంలో హైకోర్టు (Telangana High Court) ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు అమలు కావడం లేదని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) మాట్లాడుతూ..గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేశామని, విచారణ జరగాల్సి ఉందని వివరించారు. సుప్రీం కోర్టు విచారణ జరిగే వరకు హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిందేని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజల్లో కరోనా ర్యాండమ్‌ టెస్టులు చేయడంలేదని ప్రభుత్వంపై ఆసహనం వ్యక్తం చేసింది. రక్షణ కిట్లు తగినంత సరఫరా చేయనందుకే వైద్యులకు కరోనా వైరస్‌ సోకిందని తెలిపింది. వలస కార్మికులు ఎందుకు నడిచి వెళుతున్నారు, వెంటనే శ్రామిక్‌ రైళ్లలో పంపేందుకు రైల్వే శాఖతో సంప్రదింపులు జరపండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు

మీడియా బులెటెన్‌లో తప్పడు లెక్కలు ఇస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వాస్తవాలు తెలియకుంటే ప్రజలకు కరోనా తీవ్రత ఎలా తెలుస్తుందని ఈ సంధర్భంగా ప్రశ్నించింది. ఈ నెల 17లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని వైద్యారోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది. వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.