Telangana High Court: ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసింది, కేసీఆర్ సర్కారుపై మండిపడిన తెలంగాణ హైకోర్టు, హెల్త్‌ బులెటిన్‌లలో సమగ్ర వివరాలు ఇవ్వడం లేదని ఆగ్రహం

రాష్ట్ర ప్రభుత్వం (TS Government) ప్రజలను గాలికి వదిలేసిందంటూ మండిపడింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై (Coronavirus Situation) హైకోర్టులో నేడు సుదీర్ఘ విచారణ కొనసాగింది. కోర్టు ఆదేశాలు పాటించని అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నించింది. అధికారులపై కేసు పెట్టి సస్పెండ్‌‌ చేయాలని ఎందుకు ఆదేశించకూడదో తెలపాలని అడిగింది. పదేపదే కోర్టు ఆదేశిస్తున్నప్పటికీ ఒక్క తీర్పు కూడా అమలు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

High Court of Telangana| Photo Credits: Wikimedia Commons

Hyderabad, July 20: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు (Telangana High Court) సీరియస్ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం (TS Government) ప్రజలను గాలికి వదిలేసిందంటూ మండిపడింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై (Coronavirus Situation) హైకోర్టులో నేడు సుదీర్ఘ విచారణ కొనసాగింది. కోర్టు ఆదేశాలు పాటించని అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నించింది. అధికారులపై కేసు పెట్టి సస్పెండ్‌‌ చేయాలని ఎందుకు ఆదేశించకూడదో తెలపాలని అడిగింది. పదేపదే కోర్టు ఆదేశిస్తున్నప్పటికీ ఒక్క తీర్పు కూడా అమలు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా వ్యాక్సిన్‌లో ముందడుగు, హైదరాబాద్‌లో నిమ్స్‌లో మానవులపై తొలి ప్రయోగం, 28 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో డోస్‌ తీసుకున్న వ్యక్తి

దీంతో పాటుగా కరోనా పరీక్షలు, సమాచారం వెల్లడి తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షల్లో తెలంగాణ ప్రభుత్వం వెనకబడి ఉందని తెలిపింది. ఓ వైపు కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతున్నట్లు నటిస్తుందా అని మండిపడింది. కరోనాపై విడుదల చేస్తున్న హెల్త్‌ బులెటిన్‌లలో సమగ్ర వివరాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.5 వేల కరోనా ఇంజెక్షన్ రూ.30 వేలకు, హైదరాబాద్‌లో పట్టుబడిన ముఠా, ఏడుమంది అరెస్ట్, వివరాలను వెల్లడించిన కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు

ఆస్పత్రుల వారీగా బెడ్లు, వెంటిలేటర్ల వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. అధికారులు ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలు దాచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాచారం తెలుసుకోవడం అనేది ప్రజల ప్రాథమిక హక్కు అని పేర్కొంది. మరోవైపు కరోనాపై విడుదల చేసిన బులెటిన్‌లో హైకోర్టు అభినందించిందని ఇవ్వడంపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు మెట్టికాయలు వేస్తుంటే అభినందించినట్టు ఎలా చెప్తారని ప్రశ్నించింది.