Corona Vaccine Trials in NIMS (Photo-Twitter)

Hyderabad, July 20: క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలో (Corona Vaccine) భార‌త్‌ అడుగులు క్ర‌మంగా ముందుకు ప‌డుతున్నాయి.. దేశంలోని అన్ని ఫార్మా సంస్థలకన్నా ముందున్న హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) తయారుచేసిన కోవ్యాక్సిన్‌‌పై హ్యూమన్‌ ట్రయల్స్ ఇప్ప‌టికే ప్రారంభం అయ్యాయి.. దేశ‌వ్యాప్తంగా 12 ప్రదేశాల్లో తొలిదశలో ట్ర‌య‌ల్స్ ప్రారంభం కాగా ఇవాళ హైద‌రాబాద్‌లోని నిమ్స్ ఆస్ప‌త్రిలోనూ (Corona Vaccine Trials in NIMS) క‌రోనా వ్యాక్సిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ మొదలు పెట్టారు. నాలుగు రోజుల్లో 1.30 ల‌క్ష‌ల కరోనా కేసులు నమోదు, దేశంలో 11 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు, 27,497కు చేరుకున్న మరణాలు

హైదరాబాద్‌లోని నిమ్స్‌ కేంద్రంగా పనిచేస్తున్న వ్యాక్సిన్‌ తయారీ బృందం క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా సోమవారం వాలంటీర్‌కు తొలి డోస్‌ను (Volunteers Receive First Dose) ఇచ్చారు. ఇదే తరహాలో దేశ వ్యాప్తంగా మొత్తం 12 వైద్య కేంద్రాల్లో వ్సాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ (Corona Vaccine Trials) జరుగుతున్నాయి. ఐసీఎంఆర్‌ అనుమతితో మొదలు పెట్టిన క్లినికల్ ట్రయల్స్ ను ఫేస్ 1, ఫేస్ 2 కింద జరుగనున్నాయి. ఇక ఈ వ్యాక్సిన్ ని ఆగస్టు 15వ తేదీ నాటికి తయారు చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ICMR) భావిస్తోంది.

Here's Corona Vaccine Trials Begin At Hyderabad's NIMS

మొదటిదశ వ్యాక్సిన్‌ తీసుకున్నవారిని 28 రోజులపాటు పరీక్షించాల్సి ఉంటుంది. వారి శరీరంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు నమోదు చేసి వివరాలను ఐసీఎమ్మార్‌కు పంపాల్సి ఉంటుంది. వారి ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి రెండో దశలో ఎంతమందిపై ఎక్కడెక్కడ క్లినికల్‌ ట్రయల్స్ చేయాలో ఓ నిర్ణ‌యానికి రానుంది ఐసీఎమ్మార్. కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు 60 మంది వాలంటీర్లు ఈ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ కోసం త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకున్న‌ట్టు నిమ్స్ వైద్యులు వెల్ల‌డించారు.

కరోనా వైరస్ ని అంతం చేయడానికి ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ ని కనిపెట్టే పనిలో పడ్డ విషయం తెలిసిందే. అదే విధంగా భారత దేశంలోని సైంటిస్టులు కూడా వైరస్ కు ఆంటి వ్యాక్సిన్ ని కనిపెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలు మానవులపై రెండో దశ ప్రయోగాల్ని కూడా పూర్తి చేశాయి. మరి కొన్ని ప్రయోగ దశలో ఉన్నాయి. వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసే విషయంలో నగరానికి చెందిన భారత్‌ బయోటెక్, పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)తో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే.