IPL Auction 2025 Live

TG Weather Update: తెలంగాణపై చలి-పులి పంజా.. అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు రాత్రి ఉష్ణోగ్రతలు.. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రానున్న మూడ్రోజుల్లో ఇంకా పడిపోనున్న ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలలోపు నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

Winter Season - Representational Image | Photo: IANS

Hyderabad, Nov 26: తెలంగాణపై (Telangana) చలి-పులి పంజా విసురుతున్నది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలలోపు నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత (Cold Wave) మరింత ఎక్కువగా ఉన్నదని చెబుతున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. సిర్పూర్‌(యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహీర్‌ లో అత్యల్పంగా 8.8, ఆదిలాబాద్‌ జిల్లా బేలలో 9.9 డిగ్రీలు నమోదైంది. ఆసిఫాబాద్‌, సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన 27 జిల్లాల్లో 15 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

బంగాళాఖాతంలో వాయుగుండం.. నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. ఈ నెల 29 వరకు వానలే వానలు.. దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు

చలికి కారణం అదే..

తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండటమే చలి తీవ్రత పెరగటానికి కారణమని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

మరో మూడ్రోజులు ఇంకా పడిపోనున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడ్రోజులు చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

చలితో గజగజలాడుతున్న తెలంగాణ.. సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక

 



సంబంధిత వార్తలు

TG Weather Update: తెలంగాణపై చలి-పులి పంజా.. అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు రాత్రి ఉష్ణోగ్రతలు.. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రానున్న మూడ్రోజుల్లో ఇంకా పడిపోనున్న ఉష్ణోగ్రతలు

Rains in AP: బంగాళాఖాతంలో వాయుగుండం.. నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. ఈ నెల 29 వరకు వానలే వానలు.. దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు

TG Weather Update: చలితో గజగజలాడుతున్న తెలంగాణ.. సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక

Rains in AP: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఎల్లుండి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. మూడు రోజుల పాటు సముద్రంలో అలజడి.. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని అధికారుల హెచ్చరికలు