Rains in AP (Credits: X)

Vijayawada, Nov 26: ఆగ్నేయ బంగాళాఖాతంలో (Bay of Bengal) శనివారం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని (AP) దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈ నెల 29 వరకు కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా వాయుగుండం తీరం దిశగా వచ్చే సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరి కోతలు కోసే రైతులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు, కొండ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి రేపు, ఎల్లుండి 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ఏపీఎస్డీఎంఏ వివరించింది.

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఎల్లుండి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. మూడు రోజుల పాటు సముద్రంలో అలజడి.. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని అధికారుల హెచ్చరికలు

నేడు ఇక్కడ వర్షాలు

నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి.

27న ఇక్కడ వర్షాలు

నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయి.

28న ఇక్కడ వర్షాలు  

అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి.

29న ఇక్కడ వర్షాలు  

గుంటూరు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు... విశాఖ, అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది.