Husnabad Murder: హుస్నాబాద్‌లో యువకుడిని బీర్ల సీసాలతో పొడిచి చంపేశారు, కర్మన్‌ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, బంజారా హిల్స్‌లో మరో ఘోర ప్రమాదం, నుజ్జు నుజ్జు అయిన కారు

స్థానిక ఎల్లమ్మ చెరువుకట్టపై శ్రీకాంత్‌ అనే యువకుడిని దుండగులు బీరు బాటిళ్లతో పొడిచి చంపారు. ఇసుక ట్రాక్టర్ల వ్యాపారం విషయంలో శ్రీకాంత్‌, బోనాల శ్రీనివాస్‌ మధ్య ఘర్షణ జరిగినట్టు సమాచారం.

Telangana young-man-murdered-at-husnabad-in-siddipet-district, three people Dead Karmanghat Car Accident (Image used for representational purpose)

Siddipet, Febuary 23: సిద్దిపేట (Siddipet) జిల్లాలోని హుస్నాబాద్‌లో (Husnabad) దారుణ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎల్లమ్మ చెరువుకట్టపై శ్రీకాంత్‌ అనే యువకుడిని దుండగులు బీరు బాటిళ్లతో పొడిచి చంపారు. ఇసుక ట్రాక్టర్ల వ్యాపారం విషయంలో శ్రీకాంత్‌, బోనాల శ్రీనివాస్‌ మధ్య ఘర్షణ జరిగినట్టు సమాచారం.

శివరాత్రి వేళ తీవ్ర విషాదం, అగ్నిగుండంలో నడుస్తుండగా తోపులాట, ఆరుగురికి గాయాలు

ఈ క్రమంలో బోనాల శ్రీనివాస్‌ మరో ఎనిమిది మందితో కలిసి... శ్రీనివాస్‌ను హత్య చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత బోనాల శ్రీనివాస్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణం తెలియాల్సి ఉంది.

కాగా తెలంగాణాలో వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఈ నెలలో తెలంగాణా వ్యాప్తంగా చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు, హత్యలు ఎక్కువగా జరిగాయి. తాజాగా రాజధాని నగరంలోని కర్మన్‌ఘాట్‌లో (Karmanghat) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా చెట్టును ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది.

క్వార్టర్ మందు ఇస్తే దిగుతా, వీధి స్తంభం ఎక్కి హల్ చల్ చేసిన మందుబాబు

కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. మృతి చెందిన వ్యక్తులు ప్రభు, సాయినాథ్, వినాయక్ శ్రీగా గుర్తించారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుబ్బల మంగమ్మ గుడికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మరో ముగ్గురు జలసమాధి

ఇక నగరంలోని బంజారాహిల్స్ ( Banjara Hills) రోడ్ నెంబర్-3లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం రాయల్ టిఫిన్ సెంటర్‌లోకి వోక్స్ వాగన్ కారు దూసుకొచ్చింది. అతి వేగంగా వచ్చిన కారు టిఫిన్ సెంటర్ కాంపౌండ్ వాల్‌ను ఢీ కొట్టింది. అయితే టిఫిన్ సెంటర్‌లో ఉన్న జనాలు అప్రమత్తం అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. TS10 EP 6331 కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినట్లు తెలిసింది. ఈ ఘటన జరిగిన అనంతరం కారు వదిలేసిన యువకులు పరారయ్యారు.

కరీంనగర్‌లో అక్కడ వరుస ప్రమాదాలు

అయితే.. కారులో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో లోపల ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. త్రుటిలోనే ప్రాణ నష్టం తప్పింది. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ రాయల్ టిఫిన్ సెంటర్‌లో గతంలోనూ ఇదే చోట చాలా ప్రమాదాలే జరిగాయి. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వచ్చే దారిలో ఇది డేంజర్ స్పాట్‌గా మారింది.