Fire (Representational image) Photo Credits: Flickr)

Nalgonda, Febuary 22: శివరాత్రి పర్వదినం (Maha Shivaratri) వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా (Nalgonda) కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో నిర్వహించిన అగ్నిగుండం (Agni Gundam) కార్యక్రమంలో భక్తులకు మంటలంటున్నాయి. ప్రతి ఏడాది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలోని పాత శివాలయం ద‍గ్గర భక్తులు అగ్నిగుండ కార్యక్రమాన్ని జరుపుతారు.

ఈ అగ్నిగుండలో నడిచేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో అగ్నిగుండంలో నడస్తుండగా తోపులాట జరిగి ప్రమాదవశాత్తు ఆరుగురు భక్తులు అగ్నిగుండంలో పడిపోయారు. వారిలో ఇద్దరి భక్తుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.

అగ్నిగుండంలో నడిచేందుకు భక్తుల అత్యుత్సాహం ప్రదర్శించారు. ఒకరి వెంట మరొకరు ఏమాత్రం సమన్వయం లేకుండా తోసుకున్నారు. నిప్పుల గుండంలో నడవాలని ఆరాటపడ్డారు. ఈ క్రమంలో ఒకరిని మరొకరు తోసుకుంటూ నిప్పుల గుండంలో పడిపోవటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని గ్రామస్తులు పేర్కొన్నారు.