Ramannapet Car Accident Bodies of 3 people recovered from a canal at Yellanki village in Ramannapet (photo-ANI)

Hyderabad, Febuary 23: తెలంగాణాలో (Telangana) వరుస కారు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఈ మధ్య జరిగిన విషాద ఘటనలు మరువక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు కారు చెరువులోకి (Car Fell In Pond) దూసుకెళ్లడంతో ముగ్గురు జలసమాధి అయ్యారు. మృతుల్లో తండ్రీకొడుకులతోపాటు మరో వ్యక్తి ఉన్నారు. ఈ ఘటన శనివారం యాదాద్రి భువనగిరి ( Bhuvanagiri) జిల్లా రామన్నపేట (Ramannapet) మండలం వెల్లంకిలో వెలుగుచూసింది.

శివరాత్రి వేళ తీవ్ర విషాదం, అగ్నిగుండంలో నడుస్తుండగా తోపులాట, ఆరుగురికి గాయాలు

రామన్నపేట మండలం సర్నేనిగూడెం సర్పంచ్‌ దర్నె రాణి భర్త మధు(35), తన కుమారుడు మణికంఠ(12), సాగుబాయి గూడేనికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు నన్నూరి శ్రీధర్‌రెడ్డి(25) కలిసి శుక్రవారం మధ్యాహ్నం కారు కడిగేందుకు వెల్లంకిలోని తన స్నేహితుడి వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు రాణి తన భర్త మధుకు ఫోన్‌ చేయగా వస్తున్నామని చెప్పారు.

ఆ కొద్దిసేపటి తరువాత మొబైల్‌ స్విచ్‌ ఆఫ్‌ కావడంతోపాటు రాత్రి వరకు ఇంటికి తిరిగిరాలేదు. ఆందోళన చెందిన సర్పంచ్‌ రాణి అతని ఆచూకీ కోసం బంధువులు, స్నేహితులను ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించింది. ఏసీపీ సత్తయ్య, సీఐ ఏవీ రంగా, ఎస్సై సీహెచ్‌ సాయిలు వెల్లంకిలోని వ్యవసాయ బావివద్ద వెతికినా ఆచూకీ లభించలేదు.

నిర్మల్- ఆదిలాబాద్ హైవేపై ప్రయాణిస్తున్న కొత్త కారులో చెలరేగిన మంటలు

శనివారం ఉదయం పోలీసులు మరోసారి బావి వద్దకు వెళ్లారు. వ్యవసాయ బావి వద్ద నుంచి సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న ఈదుల చెరువు వద్ద మధు సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ చూపించడంతో గ్రామస్థుల సహాయంతో చెరువులో సుమారు గంటకుపైగా గాలించగా కారు కనిపించింది.

కరీంనగర్‌లో అక్కడ వరుస ప్రమాదాలు

వెంటనే జేసీబీ, తాళ్ల సహాయంతో కారును బయటకు తీసి అద్దాలను పగులగొట్టి అందులోని మృతదేహాలు బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రామన్నపేట ఆస్పత్రికు తరలించారు. శుక్రవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో కారు అదుపుతప్పి ఈదుల చెరువులోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతిచెందారని పోలీసులు తెలిపారు.

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెల్లంకి గ్రామానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భర్తను, కొడుకును కోల్పోయి కన్నీరుమున్నీరైన సర్పంచ్‌ రాణిని ఎమ్మెల్యే ఓదార్చి ధైర్యం చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.