Drunken man creates ruckus after climbing high-tension electric pole In Telangana (Photo-Youtube Grab)

Secunderabad, Febuary 23: ఓ మందుబాబు (Drunken man) వినూత్న ఆలోచన చేశాడు. వీధి స్థంభం ఎక్కి క్వార్టర్ మందు కావాలంటూ ఆ ప్రాంతంలోని ప్రజలు, పోలీసులను ఆందోళనకు గురిచేశాడు. ఈ ఘటన సికింద్రాబాద్‌లో (Secunderabad) చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి  గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital) సమీపంలోని సంగీత్‌ డీమార్ట్‌ పక్కన గల ఓ వీధి స్తంభం ఎక్కి కిందకు దూకుతానని బెదిరించాడు. అతన్ని ఇలియాజ్‌గా స్థానికులు గుర్తించారు. పోల్ ఎక్కి మందు బాటిల్ ఇప్పిస్తే కిందికి దిగుతానని డిమాండ్ చేశాడు.

కరెంట్ పోల్ ఎక్కిన అతన్ని చూసి స్థానికులంతా అక్కడ గుమిగూడారు. దిగిరావాలని వారు చెప్పినా ఇలియాస్ మాత్రం వినలేదు, పైగా మందు బాటిల్ ఇవ్వకుంటే పక్కనే ఉన్న హైటెన్షన్ వైరు తాకుతానని అందర్నీ భయాందొళనకు గురిచేశాడు. ఇక చేసేదేమి లేక స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కూడా కిందికి దిగాలని బతిమాలినా మందుబాబు వినలేదు. 30 అడుగులకు కరెంటు స్తంభం ఎక్కిన ఇలియాస్ భీష్మించుకు కూర్చున్నాడు.

30 అడుగులను నుంచి పడిపోయినా, అతన్ కరెంట్ వైర్ తాకినా చనిపోతాడని భావించిన పోలీసులు కింద పరదాలను అడ్డు పెట్టారు. అతను కింద పడినా... గాయాలు కాకుండా ఉండేందుకు ‎విశాలమైన ప్లాస్టిక్ పరదాలను స్థానికులు అలాగే పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు ఎంత బతిమాలినా.. మందుబాబు ఎంతకీ కిందికి దిగిరాకపోవడంతో చివరకు దగ్గర్లోని వైన్స్ షాపులో ఒక క్వార్టర్ బాటిల్ కొని తీసుకొచ్చారు.

మద్యం సీసా చూపించడంతో పోల్‌ దిగేందుకు అంగీకరించాడు.  అక్కడ స్ట్రీట్‌ లైట్స్‌ బిగించేందుకు ఉపయోగించే క్రేన్‌ సాయంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది అతన్ని కిందకు దించారు.  దిగేముందు తాను స్తంభం దిగి వస్తానని, తనని ఏమీ అనకూడదని షరతు విధించాడు. దానికి పోలీసులు సరే అని చెప్పడంతో ఇలియాస్ కిందికి దిగాడు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.