Telangana COVID-19: వారికి క్వారంటైన్ నిబంధనల్లో సడలింపు, తెలంగాణలో కొత్తగా 2,924 మందికి కరోనా, రాష్ట్రంలో 1,23,090కు చేరుకున్న కోవిడ్-19 కేసుల సంఖ్య
10 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,23,090 కరోనా కేసులు నమోదుకాగా.. 818 మరణాలు (Telangana Coronavirus Deaths) సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 31,284 యాక్టివ్ కేసులుండగా.. 90,988 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు తెలంగాణలో 13,27,791 కరోనా పరీక్షలు నిర్వహించారు. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 461, రంగారెడ్డి 213, ఖమ్మం 181, కరీంనగర్ 172, నల్గొండ 171, మేడ్చల్ 153, నిజామాబాద్ 140, సూర్యాపేట 118, వరంగల్ అర్బన్ జిల్లాల్లో 102 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
Hyderabad, August 30: తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 2,924 పోజిటీవ్ కేసులు (Telangana COVID-19) నమోదుకాగా.. 10 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,23,090 కరోనా కేసులు నమోదుకాగా.. 818 మరణాలు (Telangana Coronavirus Deaths) సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 31,284 యాక్టివ్ కేసులుండగా.. 90,988 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు తెలంగాణలో 13,27,791 కరోనా పరీక్షలు నిర్వహించారు. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 461, రంగారెడ్డి 213, ఖమ్మం 181, కరీంనగర్ 172, నల్గొండ 171, మేడ్చల్ 153, నిజామాబాద్ 140, సూర్యాపేట 118, వరంగల్ అర్బన్ జిల్లాల్లో 102 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు (foreigners) క్వారంటైన్ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం (TS Govt) సడలించింది. ఇకపై వందేభారత్ లేదా ‘ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్’ విమానాల ద్వారా విదేశాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులు ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటే నేరుగా ఇళ్లకు వెళ్లిపోవచ్చు. నాలుగు రోజుల్లోపు తిరుగు ప్రయాణ టికెట్‌లతో వ్యాపార నిమిత్తం వచ్చే వారు తమ ప్రయాణానికి 96 గంటల్లోపు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వస్తే క్వారంటైన్ (Quarantine Rules) పాటించాల్సిన అవసరం లేదని తెలిపింది. విదేశాల నుంచి వస్తున్న వ్యాధి లక్షణాలు లేని(అసింప్టమాటిక్) ప్రయాణికులకు ఈ సడలింపులు వర్తిస్తాయని ఎయిర్‌పోర్టు అధికారులు చెప్పారు. బార్లకు గ్రీన్ సిగ్నల్, సెప్టెంబర్ 30 వరకు కట్టడి ప్రాంతాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్, విద్యాసంస్థలు బంద్, అన్‌లాక్–4 మార్గదర్శకాలను విడుదల చేసిన హోంశాఖ
నెగెటివ్ ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష లేకుండా ప్రయాణిస్తున్న, వ్యాధి లక్షణాలు లేని(అసింప్టమాటిక్) మిగతా ప్రయాణికులు తప్పనిసరిగా 7 రోజుల సంస్థాగత క్వారంటైన్ దాని తరువాత హోం క్వారంటైన్ నిబంధనలకు లోబడాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే గర్భిణులు, 10 ఏళ్లలోపు పిల్లలు, వైద్య అవసరాల నిమిత్తం ప్రయాణిస్తున్న వాళ్లు హోమ్ క్వారంటైన్‌లో ఉండవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు రెగ్యులర్ విమానాలు (ఎయిర్ ట్రాఫిక్ బబుల్ ఒప్పందం మేరకు) రాకపోకలు సాగిస్తున్నాయి. బరువుంటే కరోనాతో ప్రమాదం, 26 అడుగుల దూరం వరకు కోవిడ్ వైరస్ ప్రయాణం, మహిళల కంటే పురుషులకే వైరస్ ముప్పు, రెండోసారి కరోనా సోకుతుందనే దానిపై ఇంకా వీడని సస్పెన్స్
బ్రిటిష్ ఎయిర్‌వేస్, హైదరాబాద్, లండన్ మధ్య వారానికి 4 విమాన సర్వీసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్-యూఏఈల మధ్య నడిచే ఇతర ఎయిర్‌లైన్స్ ఎతిహాద్, ప్లై దుబాయ్, ఎమిరేట్స్ సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయని ఎయిర్‌లైన్స్ వర్గాలు వెల్లడించాయి. లాక్‌డౌన్ నుంచి ఇప్పటి వరకు 55 వేల మంది హైదరాబాద్ వచ్చారని పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో ఉన్న 10 వేల మంది వివిధ దేశాలకు తరలివెళ్లారని పేర్కొన్నారు.