TSRTC Deadline: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఆర్టీసీ హుకుం! క‌రెంట్ బిల్లు క‌ట్ట‌లేద‌ని మైక్ లో బ‌హిరంగంగా ప్ర‌క‌ట‌న‌, గ‌డువులోగా క‌ట్ట‌క‌పోతే స్థ‌లాన్ని స్వాధీనం చేసుకుంటామని అల్టిమేటం

జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ పేరిట నిర్మించిన భవనంలో దుకాణాలు, సినిమా హాళ్లు, మల్టీ నేషనల్ కంపెనీలకు అద్దెకు ఇచ్చారు. కంపెనీల నుంచి అద్దె వసూలు చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి..

Armoor MLA Jeevan Reddy (Photo-Video Grab)

Nizamabad, DEC 09: ఆర్టీసీకి 7కోట్ల 27లక్షల అద్దె చెల్లించాలంటూ ఆర్మూర్ లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) మాల్ వద్ద అధికారులు మైక్ లో బహిరంగ ప్రకటన చేసి హెచ్చరించారు. 3 రోజుల్లో బకాయిలు చెల్లించాలని, లేదంటే స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. రెండున్నర కోట్లు విద్యుత్ బిల్లులు (Power Bill) కట్టకపోవడంతో ఇప్పటికే విద్యుత్ అధికారులు పవర్ కట్ చేశారు. ఆర్టీసీ (RTC) ఎప్పటికప్పుడు నోటీసులు పంపుతున్నా వాయిదా కోరడంతో గడువిస్తూ వచ్చామని అధికారులు తెలిపారు. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ కు ఆనుకుని 7వేల చదరపు గజాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే సంస్థకు 33 ఏళ్లు లీజుకు ఇస్తూ ఒప్పందం జరిగింది. 2013లో లీజుకు (TSRTC) ఇస్తూ ఒప్పందం చేసుకున్నారు. విష్ణుజిత్ ఇన్ ఫ్రా డెవలపర్స్ సంస్థ.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భార్య రజితా రెడ్డి పేరు మీద ఉంది.

KCR Hip Replacement Surgery: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శ‌స్త్ర చికిత్స విజ‌య‌వంతం, దాదాపు 3 గంట‌లు క‌ష్ట‌ప‌డ్డ వైద్యులు 

అద్దెకు తీసుకున్న స్థలంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ (Jeevan Mall) నిర్మించారు. జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ పేరిట నిర్మించిన భవనంలో దుకాణాలు, సినిమా హాళ్లు, మల్టీ నేషనల్ కంపెనీలకు అద్దెకు ఇచ్చారు. కంపెనీల నుంచి అద్దె వసూలు చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. ఆర్టీసీకి మాత్రం అద్దె చెల్లించకుండా పెండింగ్ లో పెట్టారు. ఆర్టీకి చెల్లించాల్సిన అద్దె బకాయిలు 7కోట్లకుపైగా చేరింది. దీంతో ఆర్టీసీ అధికారులు తరుచూ లీజుదారు సంస్థకు నోటీసులు ఇస్తూ వచ్చారు.

Free Bus Travel for Women in Telangana: తెలంగాణలో ఎక్కడికైనా సరే.. రేపు మధ్యాహ్నం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గుర్తింపు కార్డు చూపిస్తే చాలని తెలిపిన టీఎస్‌ఆర్టీసీ సీఎండీ సజ్జనార్‌ 

అద్దె చెల్లించకపోవడంతో హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే అద్దె చెల్లించకపోతే స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని మైక్ లో అనౌన్స్ చేశారు. లీజును రద్దు చేసి ఆర్టీసీ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, అద్దె బకాయిలు చెల్లించని కారణంగా ఏ క్షణమైనా మాల్ ను సీజ్ చేస్తామని అధికారులు చెప్పడంతో షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.



సంబంధిత వార్తలు

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు