KCR In Yashoda Hospital (Photo-X)

Hyderabad, December 08: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు శస్త్రచికిత్స (Hip Replacement Surgery) విజయవంతం అయింది. యశోద ఆస్పత్రి వైద్యులు కేసీఆర్‌కు (KCR) శస్త్రచికిత్స చేసి తుంటి ఎముకను మార్చారు. నాలుగన్నర గంటల పాటు శస్త్రచకిత్స కొనసాగింది. అయిదుగురు వైద్యుల బృందం ఆధ్వర్యంలో కేసీఆర్‌కు శస్త్రచికిత్స నిర్వహించారు. కేసీఆర్‌ను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకు మార్చారు. వ్యవసాయం క్షేత్రంలోని నివాసంలో కేసీఆర్ కాలు జారి పడ్డారు. దీంతో ఆయన ఎముక విరిగిందని వైద్యులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదంతో గతంలో విరిగిన కాలు గాయం మరోసారి తిరబడిందని వైద్యులు తెలిపారు. వెంటనే ఆయనను యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు కేసీఆర్ కు శస్త్రచికిత్స నిర్వహించారు.

 

అంతకముందు కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరా తీశారు. కేసీఆర్ కు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ కార్యదర్శి వెంటనే యశోద ఆస్పత్రికి వెళ్లారు. వాస్తవానికి ఈ విషయం రాత్రే ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి కేసీఆర్ (KCR) ఆరోగ్య పరిస్థితి గురించి వెంటనే ప్రభుత్వం స్పందించింది. వెంటనే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో పోలీస్ అధికారుల భద్రత నడుమ ఆస్పత్రికి తరలించారు.

Free Bus Travel for Women in Telangana: తెలంగాణలో ఎక్కడికైనా సరే.. రేపు మధ్యాహ్నం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గుర్తింపు కార్డు చూపిస్తే చాలని తెలిపిన టీఎస్‌ఆర్టీసీ సీఎండీ సజ్జనార్‌  

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కాలు తుంటి ఎముక ఫ్రాక్చర్ కావడంతో శస్త్ర చికిత్స పొందుతున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై జగన్ ఆరా తీశారు. ఈ మేరకు కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేసి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్షించారు.