Fresh Guidelines in TS: తెలంగాణలో మారిన ఆంక్షలు, కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల జరిగే కార్యక్రమాలకు 200 మందికి అనుమతి, కంటైన్మెంట్‌ జోన్లలో అనుమతి నిషిద్ధం

బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనే వారి సంఖ్యపై ఉన్న ఆంక్షల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

Unlock: Telangana govt issues fresh guidelines for social gatherings (Photo-PTI)

Hyd, Nov 18: కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా అమల్లో ఉన్న ఆంక్షలను (Fresh Guidelines in TS) సడలించింది. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనే వారి సంఖ్యపై ఉన్న ఆంక్షల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.కాగా కంటైన్మెంట్‌ జోన్ల వెలుపలి ప్రాంతాల్లో 100 మందికి మించకుండా సామాజిక/విద్య/క్రీడలు/వినోదం/సాంస్కృతిక/మత/రాజకీయ కార్యక్రమాలు, ఇతర సామూహిక కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ఇప్పటికే అనుమతులున్నాయి.

అయితే కొన్ని షరతుల మేరకు కంటైన్మెంట్‌ జోన్లకు వెలుపలి ప్రాంతాల్లో 100 మందికి మించిన సామర్థ్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి ఇకపై అనుమతిస్తారని తాజా ఉత్తర్వుల్లో (Telangana govt issues fresh guidelines) పేర్కొన్నారు. ఈ మేరకు గత నెల 7న జారీ చేసిన అన్‌లాక్‌–4 జీవో (136)ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాల జన సమీకరణకు ఈ ఆంక్షలు అడ్డంకిగా మారకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. నాలుగు గోడల లోపలి (క్లోజ్డ్‌ స్పేసెస్‌) ప్రాంతాల్లో 50 శాతం సామర్థ్యం మేరకు గరిష్టంగా 200 మందికి మించకుండా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతిస్తారు. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించడం, థర్మల్‌ స్క్రీనింగ్, హ్యాండ్‌ వాష్‌/శానిటైజర్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.

మోగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల నగారా, డిసెంబర్ 1న ఓటింగ్, డిసెంబర్‌ 4 న కౌంటింగ్‌, నామినేష్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్‌ 20, నామినేషన్ల పరిశీలన నవంబర్‌ 21వరకు..

బహిరంగ ప్రదేశాల్లో(ఓపెన్‌ స్పెసెస్‌) స్థల పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్లు/పోలీసు కమిషనర్లు/ఎస్పీలు/స్థానిక సంస్థలు అధిక మందిని అనుమతించవచ్చు. అయితే మాస్కులతో పాటు భౌతిక దూరం పాటించడం, థర్మల్‌ స్క్రీనింగ్, హ్యాండ్‌ వాష్‌/శానిటైజర్‌ వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. సమావేశమందిరాల్లో భౌతిక దూరం పాటించేలా సీట్లు ఏర్పాటుచేయాలి. కంటైన్మెంట్‌ జోన్లలో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదు.



సంబంధిత వార్తలు

CM Chandrababu Polavaram Visit Updates: పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు, 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి

CM Revanth Reddy: 98 శాతం కులగణన పూర్తి, తెలంగాణకు బహుజనుల తల్లి కావాలి...దొడ్డి కొమురయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: గురుకులాల్లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, పేదవారిపై నిర్లక్ష్యం తగదు...ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత కరెంట్ ఇస్తామని ప్రకటన